శివమెత్తిన శివమ్‌

వెస్టిండీస్‌ లక్ష్యం 171 పరుగులు

తిరువనంతపురం: శివమ్‌ దూబే (54, 30 బంతుల్లో 3×4, 4×6) రాణించడంతో వెస్టిండీస్‌కు భారత్‌ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పియర్‌ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (11) ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో కోహ్లీ బ్యాటింగ్‌కు రాకుండా శివమ్‌ దూబేని పంపించాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని దూబే నిలబెట్టుకున్నాడు. ఇతర బ్యాట్స్‌మెన్‌ అంతా స్వేచ్ఛగా ఆడలేకపోతున్నా అతడు మాత్రం బ్యాట్‌ ఝుళిపించాడు. కొద్దిసేపటికే రోహిత్‌ (15) కూడా పెవిలియన్‌కు చేరాడు. ఓపెనర్లు తొందరగానే పెవిలియన్‌కు చేరినా కోహ్లీ (19)తో కలిసి దూబే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కవ్వించిన పొలార్డ్‌కు బ్యాటుతో సమాధానం చెప్పడం ఇన్నింగ్స్‌లో హైలైట్‌. పొలార్డ్‌ వేసిన 9 ఓవర్‌లో మూడు సిక్సర్లు బాది ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. తర్వాతి ఓవర్‌లో సింగిల్‌ తీసి 27 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. తన కెరీర్‌లో ఇదే తొలి హాఫ్‌ సెంచరీ. అనంతరం హేడెన్‌ వాల్ష్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి హెట్‌మెయిర్‌ చేతికి చిక్కాడు. 

ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌ (33*) ఎదుర్కొన్న రెండో బంతినే సిక్సర్‌గా మలిచాడు. అవతల ఎండ్‌లో ఉన్న కోహ్లీ కూడా బౌండరీలు బాది గేర్‌ మార్చడంతో దూబే ఔటైనా మంచి రన్‌రేట్‌తో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది‌. కానీ విలియమ్స్‌ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో విఫలమై కోహ్లీ.. సిమన్స్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కోహ్లీ ఔటైన తర్వాత విలియమ్స్‌ ఎటువంటి సంబరాలు చేసుకోకపోవడం గమనార్హం. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ (10), జడేజా (9), సుందర్‌ (డకౌట్) విఫలమయ్యారు. పంత్ పోరాడటంతో భారత్‌ 170 పరుగులు చేయగలిగింది.

మరిన్ని

భాజపా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నేడు [00:05]

భాజపా జాతీయ అధ్యక్షుడి కోసం సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 నుంచి నామినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12.30 వరకు

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:01]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...

సీఏఏని విభేదించే హక్కు రాష్ట్రాలకుంది: కాంగ్రెస్ [00:00]

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం విషయంలో విభేదించే హక్కు రాష్ట్రాలకు ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. సీఏఏ అంశం కోర్టులో తేలే వరకు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని....