కాలేయంకోసమూ...

కాలేయం మనం తినే ఆహారంలోని గ్లూకోజు, ప్రొటీన్లు, విటమిన్లు, కొవ్వుల వంటి పోషకాలను విడగొడుతుంది. ప్రమాదకరమైన అమోనియాను యూరియాగా మారుస్తుంది. మద్యం, నికొటిన్‌ వంటి హానికర పదార్థాల ప్రభావాలను తగ్గిస్తుంది. ఇలా మన కోసం నిరంతరం శ్రమించే కాలేయం ఆరోగ్యాన్ని మనం కాకపోతే ఇంకెవరు కాపాడేది? ఇందుకోసం పెద్దగా కష్ట పడాల్సిన పనీ లేదు. తినే తిండి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు.

పీచు.. పీచు

పీచు పదార్థాలు కాలేయం మరింత మెరుగ్గా పనిచేయటానికి తోడ్పడతాయి. ఉదయాన్నే వీటిని తీసుకుంటే ఇంకా మంచిది. కావాలంటే జొన్నలు, సజ్జలు, రాగుల వంటి పొట్టుతీయని ధాన్యాలతో చేసిన అల్పాహారాన్ని తీసుకోవచ్ఛు పండ్లు, కూరగాయల్లోనే కాదు.. మెంతుల్లోనూ పీచు దండిగా ఉంటుంది.


జంక్‌ఫుడ్‌ వద్దు

బర్గర్లు, పిజ్జాలు, చిప్స్‌ వంటి జంక్‌ఫుడ్స్‌ కాలేయానికి హాని చేస్తాయి. సంతృప్త కొవ్వులతో కూడిన వీటిని మితిమీరి తింటే కాలేయం పనితీరు మందగించే ప్రమాదముంది. క్రమంగా ఇది వాపు ప్రక్రియకూ దారితీయొచ్ఛు దీంతో మృదువైన కాలేయ కణజాలం గట్టిపడొచ్చు.


పచ్చగోబీ రక్ష

బ్రకోలీ (పచ్చ గోబీ పువ్వు) కాలేయానికి కొవ్వు పట్టకుండా చూస్తున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్ని కాసేపు వేడి నీటిలో ముంచి తీసి, ముక్కలుగా విప్పదీసి, కాస్త నూనెతో వేయించి తినొచ్ఛు ఆకుకూరలతో కలిపి తీసుకున్నా రుచిగా ఉంటుంది.


చక్కెర పరిమితం

చక్కెర మితిమీరితే కాలేయానికి శత్రువుగా పరిణమిస్తుంది. చక్కెరలో కొంత భాగం కొవ్వుగా మారుతుంది మరి. ఏ రూపంలోనైనా చక్కెరను ఎక్కువగా తీసుకుంటే కాలేయం మరింత ఎక్కువగా కొవ్వును ఉత్పత్తి చేస్తుంది. ఇది అక్కడక్కడే చేరి, కాలేయానికి కొవ్వు పడుతుంది.


పానీయాలకు బదులు నీరు

బరువు అదుపులో ఉంచుకుంటే కాలేయానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందువల్ల శీతల పానీయాలు, శక్తి పానీయాలు తాగేవారు వాటికి బదులు నీరు తాగటం ప్రారంభించండి. దీంతో అదనపు కేలరీలు తగ్గుతాయి. బరువు అదుపులో ఉంటుంది.


గింజపప్పుల సాయం

గింజపప్పుల్లో (నట్స్‌).. ముఖ్యంగా బాదంపప్పులో విటమిన్‌ ఇ దండిగా ఉంటుంది. ఇది కాలేయానికి కొవ్వు పట్టకుండా కాపాడుతుంది. గింజపప్పులు గుండెకూ మేలు చేస్తాయి. కాస్త ఆకలిగా ఉన్నప్పుడు నోట్లో వేసుకోవటానికి వీలుగా వీటిని అందుబాటులో ఉంచుకోవచ్ఛు సలాడ్లలోనూ కలిపి తినొచ్చు.


పాలకూర మేలు

పాలకూర, మెంతికూర, తోటకూర వంటి ఆకుకూరల్లో గ్లుటాథియోన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది కాలేయం సాఫీగా పనిచేయటానికి తోడ్పడుతుంది. ఆకు కూరల్లో పీచు సైతం దండిగా ఉంటుంది.


ఉప్పు తగ్గించండి

సోడియం ఎక్కువగా ఉండే ఆహారంతో కాలేయం గట్టిపడే ప్రమాదముందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఉప్పు మితిమీరకుండా చూసుకోవాలి. బయటి తిళ్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు ఇంట్లోనే వండుకొని తింటే అటు కాలేయానికీ ఇటు జేబుకూ మంచిదే.


మద్యానికి దూరం

మద్యం కాలేయానికి పెద్ద శత్రువు. ఇది క్రమంగా కాలేయం గట్టిపడటానికి దారితీస్తుంది. అందువల్ల మద్యానికి దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ మద్యం తాగే అలవాటుంటే పరిమితం చేసుకోవాలి. ఒక్కసారే కదా అని విందుల్లో, వేడుకల్లో అతిగా తాగకుండానూ చూసుకోవాలి.

మరిన్ని

భాజపా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నేడు [00:05]

భాజపా జాతీయ అధ్యక్షుడి కోసం సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 నుంచి నామినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12.30 వరకు

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:01]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...

సీఏఏని విభేదించే హక్కు రాష్ట్రాలకుంది: కాంగ్రెస్ [00:00]

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం విషయంలో విభేదించే హక్కు రాష్ట్రాలకు ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. సీఏఏ అంశం కోర్టులో తేలే వరకు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని....