బుమ్రా, సైని బులెట్లు రెడీ!

ముంబయి: ఆస్ట్రేలియాతో భారత్‌ మరికొద్దిసేపట్లో ముంబయి వేదికగా తొలి వన్డే ఆడనుంది. ఇరు జట్ల మధ్య సమరం హోరాహోరీగా సాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రెండు జట్లలో బ్యాటింగ్‌, బౌలింగ్ విభాగాలు ఎంతో పటిష్ఠంగా ఉన్నాయి. అయితే ఇటీవల పునరాగమం చేసిన భారత పేస్‌ దళపతి జస్ప్రీత్‌ బుమ్రా, యువ పేసర్ నవదీప్ సైనిపై అందరి దృష్టి ఉంది. వారిద్దరు ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను ఎలా కట్టడి చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. బుమ్రా, సైని కూడా ఆసీస్‌ పోరు కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. వికెట్లు ముందు ‘షూ’ని ఉంచి మరి యార్కర్ల సాధన చేశారు. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది. వారి సంధిస్తున్న బంతుల్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫించ్‌ సేనకు బుమ్రా, సైని హెచ్చరిక జారీ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.   

తుది జట్లు (అంచనా)

భారత్‌: ధావన్‌, రోహిత్‌, రాహుల్‌, కోహ్లి (కెప్టెన్‌), శ్రేయస్‌, పంత్‌, జడేజా, శార్దూల్‌, కుల్‌దీప్‌, షమి/సైని, బుమ్రా

ఆస్ట్రేలియా: వార్నర్‌, ఫించ్‌ (కెప్టెన్‌), స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్‌, హాండ్స్‌కాంబ్‌, కేరీ, అగార్‌, కమిన్స్‌, స్టార్క్‌, హేజిల్‌వుడ్‌, జంపా


మరిన్ని

2-1తేడాతో లెక్క సరిచేశారు [00:51]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో భారత్‌ కైవసం చేసుకుంది...

హార్దిక్‌ కోసం టీమిండియా ఎంపిక ఆలస్యం! [00:52]

మరికొన్ని రోజుల్లో కోహ్లీసేన న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. జనవరి 24 నుంచి అయిదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌లకు భారత జట్టును ఆదివారం సెలక్టర్లు ఎంపిక చేయాల్సి ఉంది. అయితే కివీస్‌ పర్యటనకు భారత

అండర్‌ 19లో యువ భారత్‌ విజయం [00:50]

అండర్‌ 19 ప్రపంచకప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. శ్రీలంక జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది...

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:50]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...