ఐపీఎల్‌ అంకుల్‌ ఆశలకు గండి!

ముంబయి: 48 ఏళ్ల వయసులో కూడా ఐపీఎల్‌ ఆడాలనుకుంటున్నా వెటరన్‌ స్పిన్నర్ ప్రవీణ్‌ తాంబే ఆశలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్‌లో ఆడేందుకు తాంబే అనర్హుడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత ఏడాది యూఏఈలో జరిగిన టీ10 లీగ్‌లో సింధీస్‌ జట్టు తరఫున ఆడినందుకు అతడిపై వేటు పడనుందని తెలుస్తోంది. ‘‘ఐపీఎల్‌లో ఆడాలనకునే భారత క్రికెటర్లు ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇతర లీగ్‌లకు దూరంగా ఉండాలనేది కచ్చితమైన నిబంధన. కానీ అతడు టీ10 డ్రాఫ్ట్‌ కోసం తన పేరుని పంపించాడు. అంతేకాకుండా ఆ లీగ్‌లో కూడా ఆడాడు. ఇది బీసీసీఐ నిబంధనలను ఉల్లంఘించడమే. అందుకే అతడు ఐపీఎల్‌ ఆడేందుకు అనర్హుడు’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలంలో ముంబయి లెగ్‌స్పిన్నర్‌ తాంబేని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.20 లక్షలు పెట్టి దక్కించుకున్న విషయం తెలిసిందే. 2013 సీజన్లో 41 ఏళ్ల వయసులో అతడు ఐపీఎల్‌లో తొలిసారి రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడాడు. అదే ఏడాది ఛాంపియన్స్‌ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసి గోల్డెన్‌ వికెట్‌ అవార్డు సంపాదించాడు. 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై హ్యాట్రిక్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2016లో గుజరాత్‌ లయన్స్‌ తరఫున, 2017లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడాడు. అయితే 2018 సీజన్లో తంబెను తీసుకోవడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 33  మ్యాచ్‌లు ఆడిన అతడు 28 వికెట్లు తీశాడు.

మరిన్ని

భాజపా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నేడు [00:05]

భాజపా జాతీయ అధ్యక్షుడి కోసం సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 నుంచి నామినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12.30 వరకు

రాహుల్‌ ఔటయ్యాక.. అదే అనుకున్నాం [00:01]

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌(19) ఔటయ్యాక.. కోహ్లీ, తాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దాలని అనుకున్నామని ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు...

సీఏఏని విభేదించే హక్కు రాష్ట్రాలకుంది: కాంగ్రెస్ [00:00]

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం విషయంలో విభేదించే హక్కు రాష్ట్రాలకు ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. సీఏఏ అంశం కోర్టులో తేలే వరకు రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని....