గోపీ..! అది సైనా సొంత నిర్ణయం

ముంబయి: గోపీచంద్‌ అకాడమీని వీడాలన్న నిర్ణయం సైనా నెహ్వాల్‌ స్వయంగా తీసుకుందని ప్రకాశ్‌ పదుకొణె బ్యాడ్మింటన్‌ అకాడమీ (పీపీబీఏ) తెలిపింది. ఆమె నిర్ణయంలో తమ జోక్యమేమీ లేదని స్పష్టం చేసింది. తన అకాడమీని వీడేందుకు ప్రకాశ్‌, విమల్‌, విరెన్‌ రస్కిర్హాయే సైనాను ప్రోత్సహించారని గోపీచంద్‌ అన్న సంగతి తెలిసిందే. త్వరలో విడుదల కానున్న తన బయోగ్రఫీ ‘డ్రీమ్స్‌ ఆఫ్‌ ఏ బిలియన్‌: ఇండియా అండ్‌ ద ఒలింపిక్‌ గేమ్స్‌’ పుస్తకంలో ‘బిట్టర్‌ రైవల్‌రీ’ అనే అధ్యాయంలో గోపీచంద్‌ దీని గురించి వెల్లడించారు.

గోపీ వ్యాఖ్యలను పదుకొణె అకాడమీ తోసిపుచ్చింది. ‘బెంగళూరులో పీపీబీఏ కేంద్రంలో శిక్షణ తీసుకోవాలన్న సైనా నిర్ణయంలో మా పాత్రేమీ లేదు. ఫామ్‌ కోల్పోయి కష్టాల్లో పడ్డ సైనాకు విమల్‌ కుమార్‌ సాయం చేశారు’ అని తెలిపింది. ప్రకాశ్‌ సర్‌ తన గురించి ఆమెకు సానుకూలంగా చెప్పలేదన్న వ్యాఖ్యలపైనా వివరణ ఇచ్చింది. ‘ఆటగాడిగా కోచ్‌గా భారత బ్యాడ్మింటన్‌కు ఎంతో సేవ చేసిన గోపీచంద్‌పై పీపీబీఏకు గౌరవం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో అతడు సాధించిన విజయాలకు మేం గర్విస్తున్నాం. అతడితో ఎప్పటికీ సత్సంబంధాలనే కొనసాగించాం. మా అకాడమీ నుంచి ఎంతో మంది షట్లర్లు ఎదిగారు. వెళ్లిపోయారు. వారి ఎదుగుదలను అడ్డుకొనే విధానమేమీ మాకు లేదు’ అని పదుకొణె అకాడమీ వెల్లడించింది.

ఇవీ చదవండి

దశాబ్దపు గెలుపు నిచ్చెనపై ఎవరెక్కడ?

అదిరేటి స్టెప్పు మేమేస్తే దడ.. అంటున్న దాదా, భజ్జీ

క్రికెటర్‌ కన్నా అధ్యక్షుడిగానే సులభం: దాదా

మరిన్ని

ప్రకాశం బ్యారేజీ మీదుగా రాకపోకలపై ఆంక్షలు [00:55]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యమానికి అనుమతి లేదని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు...

‘దొరసాని’ రెండో సినిమా ఖరారు [00:55]

‘దొరసాని’తో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసి అభిమానుల మనసు దోచుకున్న శివాత్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్‌ హీరో ...

రాజధాని కోసం ఆగిన మరో గుండె [00:55]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [00:54]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

ఆ రైల్వే స్టేషన్లలో సంస్కృతం [00:54]

ఉత్తరాఖండ్‌ రైల్వేస్టేషన్లలోని నామ ఫలకాలపై ఉర్దూ స్థానంలో ఇకపై సంస్కృతం వచ్చి చేరనుంది. రైల్వే ప్లాట్‌ఫాంపై ఉండే నామ ఫలకాలు ఆ రాష్ట్రానికి చెందిన ద్వితీయ భాష....

సరికొత్త లుక్‌లో బాలకృష్ణ.. ఎందుకోసం..? [00:54]

పాత్ర అంటే ప్రాణం పెట్టే నటుల్లో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక ఫొటో సామాజిక మాధ్యమాల...

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం [00:53]

గుజరాత్‌ రాష్ట్రంలోని సురేంద్రనగర్‌ జిల్లా ఘోర దేవ్‌పరా వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

ఫేస్‌బుక్‌ పోస్టు.. సినిమాలాంటి ట్విస్టు [00:53]

మంచి చేసేవాళ్లకు ఎప్పటికైనా మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ వార్త చదివితే ఎవరికైనా అది  నిజమనిపించక మానదు.

రూపాయి విలువ చేసే చాక్లెట్లు దొంగిలించాడని.. [00:53]

బెంగళూరులో దారుణం జరిగింది. రెండు చాక్లెట్లు దొంగిలించినందుకు ఓ బాలుడి జుట్టు, కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు ఓ సూపర్‌ మార్కెట్‌ యజమాని కత్తిరించాడు...........

హైదరాబాద్‌లో కాళ్లు,చేతులు కట్టి ఉరేశారు! [00:53]

గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడి కాళ్లు, చేతులు కట్టేసి ఉరివేసిన ఘటన హైదరాబాద్‌ శివారులో చోటుచేసుకుంది. బాలాపూర్‌ ఠాణా పరిధిలో...