స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగించాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో నష్టాలతో ప్రారంభమైనప్పటికీ.. ఊగిసలాటలోనే మార్కెట్లు కొనసాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 92 పాయింట్లు లాభపడి.. 41,952 వద్ద ముగించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 12,362 వద్ద ముగించింది. మరో రెండు రోజుల్లో అమెరికా చైనా మధ్య జరగనున్న వాణిజ్య ఒప్పందం ప్రభావం మార్కెట్లపై కనిపించలేదు. యూఎస్‌ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.70.84 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో వేదాంత, బ్రిటానియా, హీరో మోటర్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఐటీసీ షేర్లు లాభాల్లో పయనించగా.. యస్‌ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌, యూపీఎల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కొటక్‌ మహీంద్రా షేర్లు నష్టాలతో ముగిశాయి. 

మరిన్ని

జీవిత బీమాతో ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌ [00:51]

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ జీవిత బీమాతో కూడిన మరో ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను తీసుకొచ్చింది. రూ.2లక్షల జీవిత బీమాతో కూడిన రూ.179 ప్రీపెయిడ్‌...

రిలయన్స్‌ పెట్రోల్‌ పంపుల్లో విక్రయాల జోరు [00:52]

దేశీయ చమురు రంగ దిగ్గజం రిలయన్స్‌ చమురు రిటైల్‌ మార్కెట్లో కూడా తన హవా కొనసాగిస్తోంది. రిలయన్స్‌కు చెందిన దాదాపు 1,400 పెట్రోల్‌...

ఎన్నెన్నో ప్రకటనలు.. కొన్నే అమలు..! [00:52]

ప్రభుత్వాలు బడ్జెట్లలో ఎన్నో ప్రకటనలను ఆర్థికమంత్రి చేస్తుంటారు. కానీ, వాస్తవంగా వీటిల్లో కొన్నే అమలవుతాయి. ప్రతి ప్రభుత్వంలో ఇవి సర్వసాధారణం...

తదుపరి బోర్డు సమావేశంలో డివిడెండ్‌పై నిర్ణయం! [00:50]

రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) కేంద్రానికి ఇవ్వాల్సిన మధ్యంతర డివిడెండు అంశంపై తదుపరి సెంట్రల్‌ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు మీడియా వర్గాల నుంచి సమాచారం.