4.. రారాజుకు లాభమా? నష్టమా?

ముంబయి: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో ఎక్కువగా వన్‌డౌన్‌లోనే ఆడాడు. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. సరికొత్త రికార్డులు సృష్టించాడు. 242 వన్డేల్లో 59.84 సగటుతో 11,609 పరుగులు చేశాడు. అందులో 43 శతకాలు, 55 అర్ధశతకాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో జట్టు కూర్పు కోసం త్యాగానికి సిద్ధపడుతున్నాడు. నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. శ్రీలంక సిరీసులో రోహిత్‌కు విశ్రాంతినివ్వడంతో రాహుల్‌, ధావన్‌ ఓపెనింగ్‌ చేశారు. ఇప్పుడు హిట్‌మ్యాన్‌ అందుబాటులోకి రావడంతో రాహుల్‌ను తప్పించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ముంబయి మ్యాచులో అతడిని మూడో స్థానంలో ఆడించి తాను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు.

గతంతో పోలిస్తే పరుగుల యంత్రం కోహ్లీ నాలుగో స్థానంలో అంతగా ఆడటం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ముంబయి మ్యాచ్‌ను మినహాయిస్తే విరాట్‌ నాలుగో స్థానంలో 38 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 56.48 సగటు, 90.49 స్ట్రైక్‌రేట్‌తో 1751 పరుగులు చేశాడు. అంటే మొత్తం పరుగుల్లో దాదాపు 16 శాతం అన్నమాట. 7 శతకాలు, 8 అర్ధశతకాలు ఖాతాలో ఉన్నాయి. 2015, జనవరి నుంచి మాత్రం నాలుగో స్థానంలో అంచనాలు అందుకోవడం లేదు. ఆరు సార్లు బరిలోకి దిగితే 9, 4, 3*, 11, 12, 7 మాత్రమే చేశాడు. ఇప్పుడు ముంబయి మ్యాచులోనూ 14 బంతులు ఆడి 16 పరుగులే చేశాడు. తన స్థానం మార్పు గురించి మరోసారి ఆలోచించుకోవాలని అభిమానులు కోరుతున్నారు.

ఇవీ చదవండి..

విజయాల నిచ్చెనపై ఎవరెక్కడ?

పంత్‌ వల్లే నా భార్యకు లక్షల సంఖ్యలో ఫాలోవర్లు

అదిరేటి స్టెప్పు మేమేస్తే దడ.. అంటున్న భజ్జీ, దాదా

మరిన్ని

తెదేపా నేతల గృహనిర్బంధం [01:05]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. 13 జిల్లాల్లో తెదేపా నాయకులు, ఐకాస నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఇప్పటికే ప్రతిపక్ష తెదేపా నేతలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో

ప్రకాశం బ్యారేజీ మీదుగా రాకపోకలపై ఆంక్షలు [00:55]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యమానికి అనుమతి లేదని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు...

‘దిల్లీలో కొట్లాట..గల్లీలో షేక్‌హ్యాండ్‌’ [01:04]

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను కోరారు. మున్సిపల్‌ ఎన్నికల...

దీపికపై అభిమానుల ఫైర్‌ [01:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కొత్త నిబంధనలు [01:32]

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వితరణలో రాయితీ విధానానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం అర్ధరాత్రితో మంగళం పాడింది. ప్రస్తుతం వివిధ రకాల ద్వారా దర్శనం చేసుకునే యాత్రికులకు...

అణిచివేత చర్యలు అప్రజాస్వామికం: చంద్రబాబు [01:05]

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెదేపా నేతల గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. పోలీసుల చర్యను హేయమైందిగా చంద్రబాబు పేర్కొన్నారు. తమ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రజలు

మంత్రి మల్లారెడ్డి టికెట్లు అమ్ముకున్నారు:రేవంత్‌ [01:04]

దిల్లీ నుంచి తాను నిధులు తీసుకొస్తానని.. వాటిని సక్రమంగా ఖర్చు పెట్టాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. కాలనీలను అభివృద్ధి చేయాలంటే...

‘దొరసాని’ రెండో సినిమా ఖరారు [00:55]

‘దొరసాని’తో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసి అభిమానుల మనసు దోచుకున్న శివాత్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్‌ హీరో ...

రాజధాని కోసం ఆగిన మరో గుండె [00:55]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [00:54]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...