వడ్డీరేట్లు యథాతథమేనా?

ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు

ముంబయి: ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో వరుసగా రెండో సమీక్షలోనూ కీలక వడ్డీరేట్లలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎలాంటి మార్పు చేయకపోవచ్చని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉల్లి, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటడంతో డిసెంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం అయిదున్నేరళ్ల గరిష్ఠానికి చేరి 7.35శాతంగా నమోదైంది. ఇక జనవరిలో ఇది 8శాతాన్ని దాటొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. మరోవైపు టోకు ద్రవ్యోల్బణం కూడా ఏడు నెలల గరిష్ఠానికి చేరింది. ఈ పరిణామాలు ఆర్‌బీఐ వడ్డీరేట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. 

సాధారణంగా ద్రవ్యోల్బణ గణాంకాలను ఆధారంగా తీసుకుని వడ్డీరేట్లలో మార్పులు చేస్తుంటారు. అయితే ఈసారి రిటైల్‌ ద్రవ్యోల్బణ స్థాయి గణనీయంగా ఉండటంతో ఫిబ్రవరిలో జరిగే సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచే అవకాశాలున్నాయని ఎస్‌బీఐ అధ్యయన నివేదిక పేర్కొంది. గత డిసెంబరులో జరిగిన సమీక్షలోనూ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే. అంతేగాక, 2020 సంవత్సరం మొత్తంలోనూ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు కన్పించట్లేదని ఈ నివేదిక పేర్కొంది. 

ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంతదాస్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 ఫిబ్రవరి నుంచి అక్టోబరు మధ్య వరుసగా రేట్ల కోత చేపట్టారు. ఈ కాలంలో మొత్తం 5 సార్లు 135 బేసిస్‌ పాయింట్ల మేర కీలక వడ్డీరేట్లను తగ్గించారు. అయితే మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ.. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో గత డిసెంబరులో జరిగిన సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. వచ్చే నెలలో తదుపరి సమీక్ష జరగనుంది. ఫిబ్రవరి 6న ఆర్‌బీఐ సమీక్ష నిర్ణయాలను ప్రకటిస్తారు. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత జరగబోయే సమీక్ష కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. 

మరిన్ని

13 అంతస్తుల భవనంపైకి ఎక్కి రైతుల నిరసన [13:36]

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌ భవనంపైకి ఇద్దరు రైతులు ఎక్కడం ఆందోళన కలిగిస్తోంది. తుళ్లూరు, నెక్కల్లు గ్రామాలకు చెందిన కొందరు రైతులు నూతనంగా నిర్మిస్తున్న ఎమ్మె్ల్యే క్వార్టర్స్‌ వద్ద

‘డమ్మీ కాన్వాయ్‌తో ట్రయల్‌ రన్‌..సిగ్గుచేటు’ [19:32]

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పెరిగే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ ఒప్పందం చేసుకున్నారని.. అందుకే అమరావతిని చంపేస్తున్నారని...

‘దిల్లీలో కొట్లాట..గల్లీలో షేక్‌హ్యాండ్‌’ [20:54]

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను కోరారు. మున్సిపల్‌ ఎన్నికల...

కశ్మీర్‌లో ఇంటర్నెట్ ఆ సినిమాలు చూసేందుకే కదా! [23:52]

జమ్ముకశ్మీర్లో ఆర్టికల్‌ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అక్కడ ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడాన్ని నీతిఆయోగ్‌ సభ్యుడు, జేఎన్‌యూ ఛాన్సలర్‌ వీకే సరస్వత్‌ సమర్థించుకున్నారు. ఆ ప్రాంతంలో అంతర్జాలాన్ని నిలిపివేయడం వల్ల పెద్దగా నష్టమేమీలేదని ఆయన అన్నారు.  ‘‘ కశ్మీర్లో  ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్నప్పుడు, లేనప్పుడు ఏం తేడా కనిపించింది.  అక్కడ ఇంటర్నెట్లో ఏం చూస్తారు...

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం [23:44]

గుజరాత్‌ రాష్ట్రంలోని సురేంద్రనగర్‌ జిల్లా ఘోర దేవ్‌పరా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలవగా, మరో ఐదుగురు గాయపడ్డారు. వీరంతా గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది

అణిచివేత చర్యలు అప్రజాస్వామికం: చంద్రబాబు [23:38]

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెదేపా నేతల గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తమ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రజలు ఉన్నారని, ప్రభుత్వానికి తమ ఆకాంక్షలను తెలియజేయాలనుకున్న తరుణంలో ఈ విధమైన అణిచివేత చర్యలు...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [23:32]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

తెదేపా నేతల గృహనిర్బంధం [23:24]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. 13 జిల్లాల్లో తెదేపా నాయకులు, ఐకాస నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఇప్పటికే ప్రతిపక్ష తెదేపా నేతలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో

రాజధాని కోసం ఆగిన మరో గుండె [23:19]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

దీపికపై అభిమానుల ఫైర్‌ [23:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...