మళ్లీ జరిగితే చేతులు కట్టుకుని కూర్చోం:పవన్‌

కాకినాడ: తమవైపు నుంచి ఎలాంటి కవ్వింపు లేకున్నా వైకాపా నేతలు దూషించి దాడి చేశారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. వైకాపా నేతల భాష దారుణంగా ఉందన్నారు. కాకినాడలో ఇటీవల వైకాపా దాడిలో గాయపడిన జనసేన కార్యకర్తలను పవన్‌ పరామర్శించారు. అనంతరం హెలికాన్‌ టైమ్స్‌ వద్ద  నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కారణం లేకుండా తమపై దాడికి పాల్పడితే పోలీసు శాఖ చోద్యం చూడటం బాధ కలిగించిందన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. నిరసనలు తెలిపే హక్కు తమకూ ఉందన్నారు.

ద్వారంపూడిపై కేసు నమోదు చేయాలి

కాకినాడ ఘటనకు బాధ్యుడిగా స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదు చేయాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. తాము శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే మీరెవరూ ఉండలేరని వ్యాఖ్యానించారు. ‘ఇంకోసారి జనసేన కార్యకర్తలపై ఇలాంటి దాడులు జరిగితే మేం చేతులు కట్టుకొని కూర్చోబోం’ అని హెచ్చరించారు. తాము చాలా బాధ్యతగా రాజకీయాలు చేస్తున్నామని చెప్పారు. ఈ దాడులకు కారణమైన వైకాపా నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలన్నారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ కారణమైన ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

ఫ్యాక్షన్‌ సంస్కృతికి ప్రజలు సహకరించరు

సంక్రాంతి సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పవన్‌ అన్నారు. పండుగ వాతావరణం కలుషితమవడానికి వైకాపా నేతల భాషే కారణమని.. ఈ తరహా భాష వాడటం ఇదే ఆఖరిసారి కావాలన్నారు. కేసులు పెడతామంటే జనసేన ఎప్పుడూ భయపడదని చెప్పారు. తెగించే రాజకీయాల్లోకి వచ్చామని ఆయన స్పష్టం చేశారు. వైకాపా నేతలు ఇదే పంథా కొనసాగిస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అధికారం ఎల్లవేళలా ఉండదనే విషయాన్ని వాళ్లు గుర్తు పెట్టుకోవాలన్నారు. పాలెగాళ్ల రాజ్యం, ఫ్యాక్షన్‌ సంస్కృతి తెస్తామంటే ప్రజలు సహించరని.. సుస్థిరపాలన ఇవ్వాలని వైకాపా ప్రభుత్వానికి పవన్‌ సూచించారు.

భాజపాతో కలిసి వెళ్లడంపై ఈనెల 16న కీలక భేటీ

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు, భాజపా నేతలతో చర్చించామని పవన్‌ చెప్పారు. దిల్లీ పర్యటన వివరాలను ఆయన వివరించారు. రాజధాని రైతుల సమస్యలు, రాష్ట్రంలో పెట్టుబడులు వెనక్కిపోవడం, అమరావతిలో 144 సెక్షన్‌ విధించడం తదితర అంశాలపై చెప్పామని తెలిపారు. దీనిపై కొద్దిరోజులుగా సంభాషణలు జరుగుతున్నాయని తెలిపారు. ఏ ఆశయాలతో ప్రధాని మోదీ ముందుకెళ్తున్నారో ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదని వివరించామన్నారు. రాష్ట్రానికి బలమైన సహాయ సహకారాలు కావాలని.. దీనిపై దృష్టి సారించాలని భాజపాను కోరామని పవన్‌ చెప్పారు. ఈనెల 16న ఉదయం 11 గంటలకు విజయవాడలో కీలక సమావేశం ఏర్పాటుచేసి భాజపాతో కలిసి వెళ్లడంపై సంయుక్త ప్రకటన చేస్తామని ఆయన స్పష్టం చేశారు.  

రాపాకపై ఎలాంటి ఒత్తిడులు ఉన్నాయో?

అధికార వికేంద్రీకరణపై ఎన్నికల ముందే వైకాపా చెప్పాల్సిందని పవన్‌ అన్నారు. రాజధాని.. విశాఖ ప్రజలు కోరుకున్నది కాదని, పొలాలు ఉన్నందున వైకాపా నాయకులు కోరుకున్నారని ఆరోపించారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ వైకాపాతో సన్నిహితంగా ఉంటున్నారనే ప్రశ్నకు ఆయనపై ఎలాంటి ఒత్తిడులు ఉన్నాయో అని పవన్‌ వ్యాఖ్యానించారు. 

ఇవీ చదవండి..!

కార్యకర్తలను పరామర్శించిన పవన్‌

ఫొటో గ్యాలరీ

పవన్‌ రాక.. పోలీసుల మోహరింపు! 

కాకినాడలో వైకాపా వీరంగం

 


మరిన్ని

13 అంతస్తుల భవనంపైకి ఎక్కి రైతుల నిరసన [13:36]

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌ భవనంపైకి ఇద్దరు రైతులు ఎక్కడం ఆందోళన కలిగిస్తోంది. తుళ్లూరు, నెక్కల్లు గ్రామాలకు చెందిన కొందరు రైతులు నూతనంగా నిర్మిస్తున్న ఎమ్మె్ల్యే క్వార్టర్స్‌ వద్ద

‘డమ్మీ కాన్వాయ్‌తో ట్రయల్‌ రన్‌..సిగ్గుచేటు’ [19:32]

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పెరిగే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ ఒప్పందం చేసుకున్నారని.. అందుకే అమరావతిని చంపేస్తున్నారని...

‘దిల్లీలో కొట్లాట..గల్లీలో షేక్‌హ్యాండ్‌’ [20:54]

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను కోరారు. మున్సిపల్‌ ఎన్నికల...

కశ్మీర్‌లో ఇంటర్నెట్ ఆ సినిమాలు చూసేందుకే కదా! [23:52]

జమ్ముకశ్మీర్లో ఆర్టికల్‌ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అక్కడ ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడాన్ని నీతిఆయోగ్‌ సభ్యుడు, జేఎన్‌యూ ఛాన్సలర్‌ వీకే సరస్వత్‌ సమర్థించుకున్నారు. ఆ ప్రాంతంలో అంతర్జాలాన్ని నిలిపివేయడం వల్ల పెద్దగా నష్టమేమీలేదని ఆయన అన్నారు.  ‘‘ కశ్మీర్లో  ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్నప్పుడు, లేనప్పుడు ఏం తేడా కనిపించింది.  అక్కడ ఇంటర్నెట్లో ఏం చూస్తారు...

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం [23:44]

గుజరాత్‌ రాష్ట్రంలోని సురేంద్రనగర్‌ జిల్లా ఘోర దేవ్‌పరా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలవగా, మరో ఐదుగురు గాయపడ్డారు. వీరంతా గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది

అణిచివేత చర్యలు అప్రజాస్వామికం: చంద్రబాబు [23:38]

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెదేపా నేతల గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తమ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రజలు ఉన్నారని, ప్రభుత్వానికి తమ ఆకాంక్షలను తెలియజేయాలనుకున్న తరుణంలో ఈ విధమైన అణిచివేత చర్యలు...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [23:32]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

తెదేపా నేతల గృహనిర్బంధం [23:24]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. 13 జిల్లాల్లో తెదేపా నాయకులు, ఐకాస నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఇప్పటికే ప్రతిపక్ష తెదేపా నేతలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో

రాజధాని కోసం ఆగిన మరో గుండె [23:19]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

దీపికపై అభిమానుల ఫైర్‌ [23:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...