‘పోకిరి’కి మించి వేరే చేద్దాం!

చాలా సంవత్సరాల తర్వాత అభిమానులను సంతృప్తిపరిచేలా సినిమాను తీయడం సంతోషంగా ఉందని అన్నారు అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషించారు. జనవరి 11న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ‘ఇది కదా మహేశ్‌బాబు సినిమా అంటే’ అని అభిమానులు అనుకునేలా ఉంది. ఈ సందర్భంగా ట్విటర్‌ వేదికగా అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలను అనిల్‌ రావిపూడి అడగ్గా, మహేశ్‌ వాటికి ఇచ్చిన సమాధానాలు..

బ్లాక్‌ బస్టర్‌ కాఫీ ఎక్కడ తాగారు?

మహేశ్‌బాబు: ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు  సెంటిమెంట్‌గా మా అమ్మగారు కలిపి ఇచ్చే కాఫీ తాగుతాను. బ్లాక్‌ బస్టర్‌ కాఫీ అంటే ఆవిడ కలిపి ఇచ్చేదే. 

‘తాత ఎలక కంతలో పొగ’లాంటి కథలు మీ చిన్నప్పుడు మీ గ్రాండ్‌ మదర్‌ చెప్పారా?

మహేశ్‌బాబు: మా గ్రాండ్‌ మదర్‌ చాలా కథలు చెప్పారు. కానీ, ఈ ఎలకల కథ మాత్రం డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మాత్రమే చెప్పారు(నవ్వులు). ఇది చెప్పినప్పుడు చాలా కొత్తగా ఫీలయ్యాను. 

‘సరిలేరు నీకెవ్వరులో’ సీతరామరాజుగా కృష్ణగారు కనిపించడం మీకు ఎలా అనిపించింది?

మహేశ్‌బాబు: ఈ సీన్‌ చెప్పగానే నా ఒళ్లు గగుర్పొడిచింది. తెరపై చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. నేనే హీరో కావడం, నా సినిమాలోనే ఆ సీన్‌ ఉండటం అదృష్టం. 

రెండేళ్లకొకసారైనా మాకు ఇలాంటి మాస్‌ సినిమాలు కావాలి? దయ చేసి గుర్తుంచుకోండి.

మహేశ్‌బాబు: చాలా అద్భుతమైన ప్రశ్న. ‘దూకుడు’ తర్వాత ఒక మాస్‌ జోనర్‌లో సినిమా చేయలేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. ‘శ్రీమంతుడు’ నుంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చా. ‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ అవన్నీ స్క్రిప్ట్‌కు లోబడి చేయాల్సి వచ్చింది. దర్శకుడు చెప్పింది నాకు నచ్చాలి. లేకపోతే చేయలేను. నాకు కూడా మాస్‌ సినిమా చేయాలని ఉంది. అదే సమయంలో మీరు (అనిల్‌ రావిపూడి) వచ్చి కథ చెప్పారు. ఫ్యాన్స్‌ ఏది కోరుకుంటున్నారో అది మీ దగ్గర ఉందని అర్థమైంది. అందుకే సినిమా చేయాలన్న నిర్ణయం తీసుకున్నా. నా నిర్ణయం సరైనదేనని అనిపించింది. అయితే, ఇంత పెద్ద హిట్టవుతుందని మాత్రం నేను ఊహించలేదు. ‘ఇలా కదా..! మహేశ్‌ ఉండాలి. అని అభిమానులు అనుకుంటున్నారు’ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మరిన్ని సినిమాలు చేస్తా. ‘మైండ్‌ బ్లాక్‌’ పాటలో నేను చేసిన డ్యాన్స్‌కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. చాలా మంది ఫోన్ చేసి మెచ్చుకుంటున్నారు. 

అనిల్‌ రావిపూడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..

మహేశ్‌బాబు: చెప్పలేనంత ఎనర్జీ కలిగిన వ్యక్తి. అద్భుతమైన టాలెంట్‌. దర్శకుడిగా రాబోయే దశాబ్దాన్ని ఏలుతాడు. 

సర్‌.. ఒక పాన్‌ ఇండియా సినిమా ఎప్పుడు తీస్తారు?

మహేశ్‌బాబు: ప్రస్తుతం ఒక హిట్‌తో చాలా సంతోషంగా ఉన్నా. భవిష్యత్‌లో అదృష్టం బాగుంటే చేయబోయే సినిమా పాన్‌ ఇండియా మూవీ అవుతుంది. దాని మనం ప్లాన్‌ చేయలేం. 

‘ఖలేజా’లాంటి ఎనర్జీ కలిగిన మహేశ్‌ను చూశాం. ‘పోకిరి’ తరహా మహేశ్‌ మాకు కావాలి.

మహేశ్‌బాబు: ఒకటి ఇస్తే సరిపోవడం లేదనుకుంటా(నవ్వులు). ఈ సక్సెస్‌ను నాతో పాటు మీరు ఎంజాయ్‌ చేయండి. ‘పోకిరి’కి మించి వేరే చేద్దాం!

సినిమా చూసి కృష్ణగారు ఏమన్నారు?

మహేశ్‌బాబు: ఆయన స్పందన చాలా స్పష్టంగా ఉంటుంది. ‘పోకిరి’ చూడగానే రూ.40కోట్లు చేస్తుందని అప్పుడే చెప్పారు. ఈ సినిమా చూసిన తర్వాత ఫోన్‌ చేసి, ‘పండగ అయ్యేలోగా నీ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది’ అని చెప్పారు. అల్లూరి సీతారామరాజు ట్రాక్‌ కూడా చాలా బాగా ఉందని మెచ్చుకున్నారు. 

మీరు చాలా మంది దర్శకులతో పనిచేశారు. మరి అనిల్‌ రావిపూడిలో ఏం చూశారు?

మహేశ్‌బాబు: ఇదొక భిన్నమైన అనుభూతి. ఈ విషయం చాలా ఇంటర్వ్యూలో చెప్పా. చాలా రిలాక్స్‌గా ఉంటారు. మధ్యలో కామెడీ పంచ్‌లు వేస్తుంటారు. అదే సమయంలో యూనిట్‌ మొత్తం ఆయన కంట్రోల్‌లో ఉంటుంది. 

కొండారెడ్డి బురుజు సెంటర్‌తో అటాచ్‌మెంట్‌ గురించి చెప్పండి.

మహేశ్‌బాబు: ‘ఒక్కడు’ కారణంగా కొండారెడ్డి బురుజు నాకు చాలా స్పెషల్‌. ఆ సినిమా కోసం మూడు రోజులు మాత్రమే చేశాం. చాలా పేరు వచ్చింది. ఈ సినిమాలో కొండారెడ్డి బురుజు సెట్‌ వేశారు. ప్రతి సన్నివేశంపై దర్శకుడికి పట్టు ఉంది. (మధ్యలో అనిల్‌ రావిపూడి అందుకుని, ఈ సినిమాలో కొండారెడ్డి బురుజు నేపథ్యంలో ఒక సీక్వెన్స్‌ చేశాం. థియేటర్‌లో చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచింది)

‘సరిలేరు నీకెవ్వరు’లో మీరు ‘హమ్‌ తుమ్‌.. ఎక్‌ కమరేమే బంద్‌ హో’ పాటను హమ్మింగ్‌ చేస్తూ కనిపించారు. భవిష్యత్‌లో ఏదైనా సినిమాలో పాటల పాడే అవకాశం ఉందా?

మహేశ్‌బాబు: లేదండి. పాడను. ఎవరి పని వారు చేయాలి. 

‘సరిలేరు నీకెవ్వరు’ చూసి సితార ఏమైనా ఇమిటేట్‌ చేసిందా?

మహేశ్‌బాబు: రష్మిక డైలాగ్‌ ‘నీకర్థమవుతోందా’ను ఇమిటేట్‌ చేసింది. పాటలకు కూడా డ్యాన్స్‌ చేసింది. త్వరలోనే వాటిని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తాం.

మహేశ్‌ మిమ్మల్ని హారర్‌ థ్రిల్లర్‌ తరహా మూవీలో చూడాలనుకుంటున్నాం. మీకు ఆసక్తి ఉందా?

మహేశ్‌బాబు: ఎందుకమ్మా..! శుభ్రంగా, హాయిగా ఉన్నాం కదా అందరం.  పండగ సమయంలో హారర్‌ మూవీ ఎందుకు? (నవ్వులు) 

ఆర్మీ వాళ్లను ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర బృందం ఎప్పుడు కలుస్తుంది?

మహేశ్‌బాబు: కశ్మీర్‌లో ఆర్మీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. వాళ్లు కూడా మాకు చాలా అనుమతులు ఇచ్చారు. (మధ్యలో అనిల్‌ రావిపూడి అందుకుని.. త్వరలోనే ఆర్మీ వాళ్లతో సమావేశం అవుతాం.) 

‘సరిలేరు నీకెవ్వరు’కు వచ్చిన ఉత్తమ ప్రశంస ఏది?

మహేశ్‌బాబు: నేను అనుకున్నదాని కన్నా పదింతలు ఎక్కువగా అభిమానుల నుంచి స్పందన వచ్చింది. ఇలాంటి అభినందనలు వచ్చి ఏడెనిమిది ఏళ్లు అవుతోంది. నా అభిమానులకు హ్యాట్సాఫ్‌.

తొలిసారి ఆర్మీ దుస్తులు వేసుకోవడం మీకు ఎలా అనిపించింది? మీరు నిజంగా ఆర్మీ మేజర్‌లాగానే ఉన్నారు.

మహేశ్‌బాబు: థ్యాంక్యూ. ఆర్మీ దుస్తులు వేసి టెస్ట్‌ షూట్‌ చేయడం ఇప్పటికీ నాకు గుర్తుంది. చాలా గర్వంగా ఉంది.

మ్యావ్‌.. మ్యావ్‌ పిల్లి.. అనిల్‌ రావిపూడితో సినిమా ఎప్పుడు మళ్లీ..?

మహేశ్‌బాబు: అనిల్‌ రావిపూడి ఒక సినిమా చేస్తారు. అది అయిన వెంటనే ఆయనతో నా సినిమా ఉంటుంది.

ఏ సీన్‌ చేస్తుండగా మీ ఒళ్లు గగుర్పొడిచింది?

మహేశ్‌బాబు: ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌. ఆ సీన్‌లో పాత్రలు, సన్నివేశాలు, భావోద్వేగాలు ఉచ్ఛస్థితిలో ఉంటాయి. 

మీ బలం ఏంటి?

మహేశ్‌బాబు: పరిశీలించడం(అబ్జర్వేషన్‌). ప్రతి విషయాన్ని శ్రద్ధగా పరిశీలిస్తా. తోటి నటుల నుంచే కాదు, నా సహాయకుల నుంచి కూడా నటన నేర్చుకుంటా. అదే నా బలం.

మీ గత చిత్రాలతో పోలిస్తే, ‘సరిలేరు నీకెవ్వరు’చిత్రానికి మీరెంత రేటింగ్‌ ఇస్తారు?

మహేశ్‌బాబు: నా గత చిత్రాలన్నీ నాకు ఎంతో స్పెషల్‌. అయితే, ఈ సినిమా నాకు మరింత ప్రత్యేకం. ఇందులో నా నటనకు ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. కామెడీ టైమింగ్‌, ఎమోషన్స్‌ అన్నీ కొత్తగా ఉన్నాయి. ఇందులో కొత్త మహేశ్‌ను చూశారు.

ఇండియన్‌ ఆర్మీ గురించి ఒక్క మాటలో చెప్పండి?

మహేశ్‌బాబు: హ్యాట్సాఫ్‌. వాళ్లు లేకపోతే మనం ఇక్కడ హాయిగా కూర్చోలేం. 

‘మైండ్‌ బ్లాక్‌’ పాటలో డ్యాన్స్‌ అదరగొట్టేశారు. భవిష్యత్‌లో ఇలాంటి డ్యాన్స్‌లు మీరు చేయాలి.

మహేశ్‌బాబు: దర్శకుడు అనిల్‌రావిపూడి ఆలోచన అది. ఇక రాబోయే ప్రతి సినిమాలో నా నుంచి ఇలాంటివే కోరుకుంటారేమో(నవ్వులు) రాబోయే నా ప్రతి సినిమాలో రెండు పాటలకు శేఖర్‌ మాస్టర్‌ను ఫిక్స్‌ చేస్తా. 

మీ తర్వాతి చిత్రంలో హీరోయిన్‌ ఎవరు?

మహేశ్‌బాబు: ఇంకా తెలియదండీ

మీ ఫ్యాన్స్‌ గురించి ఒక్క మాటలో చెప్పండి?

మహేశ్‌బాబు: ఇలాంటి గొప్ప ఫ్యాన్స్‌ నాకు ఉండటం నా అదృష్టం. నచ్చితే నచ్చిందని చెబుతారు. నచ్చకపోతే నచ్చలేదని చెబుతారు. ‘దూకుడు’ తర్వాత నా అభిమానుల నుంచి ఈ స్థాయి స్పందన రాలేదు. 

సినిమాలతో పాటు మీ అభిరుచులు ఏంటి?

మహేశ్‌బాబు: ఖాళీ సమయాల్లో ఇతరుల సినిమాలు చూస్తుంటా. నా పిల్లలతో సరదాగా గడుపుతా. 

ఘట్టమనేని మూడు తరాలను ఒక సినిమాలో చూడవచ్చా?

మహేశ్‌బాబు: నాకు కూడా చేయడం ఇష్టమే. అయితే, అలాంటి సినిమాకు మీరు (అనిల్‌ రావిపూడి) మాత్రమే చేయగలరు.(వెంటనే అనిల్‌ రావిపూడి అందుకుని.. మీతో సినిమా అంటే ఈసారి సరికొత్తగా ఉంటుంది)


మరిన్ని

తెదేపా నేతల గృహనిర్బంధం [01:05]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. 13 జిల్లాల్లో తెదేపా నాయకులు, ఐకాస నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఇప్పటికే ప్రతిపక్ష తెదేపా నేతలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో

ప్రకాశం బ్యారేజీ మీదుగా రాకపోకలపై ఆంక్షలు [00:55]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యమానికి అనుమతి లేదని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు...

‘దిల్లీలో కొట్లాట..గల్లీలో షేక్‌హ్యాండ్‌’ [01:04]

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను కోరారు. మున్సిపల్‌ ఎన్నికల...

దీపికపై అభిమానుల ఫైర్‌ [01:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...

అణిచివేత చర్యలు అప్రజాస్వామికం: చంద్రబాబు [01:05]

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెదేపా నేతల గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. పోలీసుల చర్యను హేయమైందిగా చంద్రబాబు పేర్కొన్నారు. తమ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రజలు

మంత్రి మల్లారెడ్డి టికెట్లు అమ్ముకున్నారు:రేవంత్‌ [01:04]

దిల్లీ నుంచి తాను నిధులు తీసుకొస్తానని.. వాటిని సక్రమంగా ఖర్చు పెట్టాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. కాలనీలను అభివృద్ధి చేయాలంటే...

‘దొరసాని’ రెండో సినిమా ఖరారు [00:55]

‘దొరసాని’తో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసి అభిమానుల మనసు దోచుకున్న శివాత్మిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్‌ హీరో ...

రాజధాని కోసం ఆగిన మరో గుండె [00:55]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [00:54]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

ఆ రైల్వే స్టేషన్లలో సంస్కృతం [00:54]

ఉత్తరాఖండ్‌ రైల్వేస్టేషన్లలోని నామ ఫలకాలపై ఉర్దూ స్థానంలో ఇకపై సంస్కృతం వచ్చి చేరనుంది. రైల్వే ప్లాట్‌ఫాంపై ఉండే నామ ఫలకాలు ఆ రాష్ట్రానికి చెందిన ద్వితీయ భాష....