మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన కోసం తమ అభిమానులు సైతం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. తమ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఎవరినీ నొప్పించకుండా అందరికంటే ప్రత్యేకంగా ఉండేలా ఆ ప్రముఖులు సైతం పోస్టులు పెడుతుంటారు. ఇటీవల యువ క్రికెటర్‌ రిషభ్‌పంత్‌తో ప్రేమలో ఉందంటూ.. వార్తల్లో నిలుస్తూ వస్తున్న బాలీవుడ్‌ అందాల తార ఊర్వశీ రౌతెలా తాజాగా ఓ పోస్టు చేసింది. అయితే పోస్టు తనకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది.
ముంబయి-పుణె రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలీవుడ్‌ నటి షబానా అజ్మీకి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే, ఆమె త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా అభిమానులతో పాటు దేశ ప్రధాని నరేంద్రమోదీ సైతం ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘అజ్మీ షబానాకు జరిగిన ప్రమాదం ఆవేదన కలిగించింది. ఆమె వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని మోదీ ట్వీట్‌ చేశారు. అయితే, అచ్చు అదే ట్వీట్‌ను పొల్లుపోకుండా నటి ఊర్వశీ రౌతెలా కాపీ కొట్టింది. ప్రధాని పెట్టిన పోస్టునే తన ట్విటర్‌ ఖాతాలోనూ పోస్టు చేసింది. ఈ పోస్టుపై ఆమె అభిమానులతో పాటు పలువురు స్పందించారు. ‘ప్రధాని మోదీగారి ట్వీట్‌ను ఎందుకు కాపీ కొట్టారు..? మీరు కూడా ప్రత్యేకంగా ట్వీట్‌ పెట్టొచ్చుగా’ అని ఒకరు స్పందించగా.. ‘బ్యూటీ విత్‌ కాపీ పేస్ట్‌’ అని మరికొంతమంది స్పందించారు. మొత్తానికి సీనియర్‌  నటి ప్రమాదంలో గాయపడితే సొంతంగా స్పందించే సమయం, ఓపిక ఊర్వశీకి లేవా అని కొంతమంది మండిపడుతున్నారు. ఏదో అనుకుంటే ఇంకేదో అవుతోందంటూ పలువురు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.

మరిన్ని

ఫేస్‌‘బుక్‌ చేస్తాడు’ [08:13]

ఫేస్‌బుక్‌ ద్వారా మహిళల సమాచారం సేకరిస్తాడు. వారి ఫోన్‌ నంబర్లు తెలుసుకుని మాట కలుపుతాడు. బంగారం వ్యాపారినంటూ ఆశ చూపుతాడు. వలలో పడ్డాక అసలు రంగు బయటపెడతాడు.. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వంద మంది

నాన్నా.. నిను మరవలేకున్నా.. [08:23]

ఇద్దరూ కుమార్తెలే.  తల్లి పేగుతెంచుకుని, తండ్రి ప్రేమను పంచుకుని జన్మించిన వారే. ఓ కుమార్తె మాత్రం తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయింది. ‘‘నాన్న లేని ఈ జన్మ ఎందుకు’’ అనుకుంది. తండ్రికి ఏకంగా తన  ప్రాణాన్నే నివాళిచ్చేందుకు ప్రయత్నించింది. మరో కుమార్తె మాత్రం అనుబంధాన్ని అపహాస్యం చేసింది. ఆస్తి పంచలేదన్న అక్కసుతో మరణించిన తల్లికి తన ఇంట్లో కాస్త చోటూ కల్పించడానికి నిరాకరించింది. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనలివి.

‘శ్రీరెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరం’ [08:34]

చిత్ర పరిశ్రమలో కొందరు కథానాయకులు, నటులతోపాటు తనను కూడా లక్ష్యంగా చేసుకుని నటి శ్రీరెడ్డి అసభ్య వ్యాఖ్యలు చేస్తోందని కరాటే కల్యాణి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌ వేదికగా తనను తిడుతూ ప్రత్యక్ష

భారత్‌పై అలక వీడని ట్రంప్‌..? [09:10]

భారత్‌-అమెరికా మధ్య వాణిజ్యం ఒప్పందం ఆశలపై నీలి నీడలు కమ్మకొంటున్నాయి. ఇప్పట్లో ఇది కుదిరే అవకాశం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి...........

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:00]

విద్యార్థుల కోసం యూట్యూబ్‌ ఛానెల్‌ను తీసుకొస్తామని, నిపుణులైన అధ్యాపకుల ద్వారా సబ్జెక్టుల పాఠ్యాంశాలపై వీడియోలు రూపొందించి ఆ ఛానెల్‌లో ఉంచుతామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. ఇప్పటికే కొన్ని చాలావరకు....

ప్రాణం తీసిన ఘర్షణ [08:57]

కూలీల మధ్య గొడవతో ఒకరు మృతిచెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదిభట్ల ఠాణా పరిధిలోని మన్నెగూడలో ఇది జరిగినట్లు సీఐ నరేందర్‌ తెలిపారు. ఆ వివరాల ప్రకారం.. తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ మన్నెగూడలోని కన్వెన్షన్‌

ఉరేసుకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య [08:49]

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని జి సిగడాం ప్రాంతానికి చెందిన పి.ఎన్‌.వి.ఎస్‌ సన్నిబాబు(33) కొంత కాలంగా సుదర్శనగర్‌ కాలనీలో నివాసముంటూ ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

రాహుల్ మెరిశాడు.. పంత్ మురిపిస్తాడా? [08:03]

‘‘గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస.. గర్జన కన్నా ఎంతో భయంకరంగా ఉంటుంది’’.. ఈ డైలాగ్‌ టీమ్ఇండియా బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌కు సరిగ్గా సరిపోతుంది. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం టెస్టుల్లో చోటు కోల్పోయిన తర్వాత నుంచి

మియాపూర్‌లో కారు బీభత్సం [07:52]

హైదరాబాద్‌ మియాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వాహనాలను ఢీకొట్టి సమీపంలోని హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హోటల్‌లో కూర్చున్న అప్జల్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నలుగురు

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..ముగ్గురు ఉగ్రవాదులు హతం [07:40]

జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. పుల్వామా జిల్లా త్రాల్‌ సెక్టార్‌లోని...........