సరికొత్త లుక్‌లో బాలకృష్ణ.. ఎందుకోసం..?

హైదరాబాద్‌: పాత్ర అంటే ప్రాణం పెట్టే నటుల్లో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది. ఇప్పటివరకూ కనిపించని లుక్‌లో బాలకృష్ణ దర్శనమివ్వడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. గుండు చేయించుకుని, మీసాలు పెంచి, వైట్‌ అండ్‌ వైట్‌ డ్రెస్‌లో చిరు నవ్వులు చిందిస్తూ కనిపించారు. అయితే, ఈ ఫొటో ఎప్పుడు, ఎక్కడ దిగారనే విషయం మాత్రం తెలియరాలేదు. 

దీన్ని చూసిన నెటిజన్లు, అభిమానులు మాత్రం దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించే చిత్రం కోసం ఇలా తయారయ్యారని అంటున్నారు. ‘పాత్ర కోసం బాలయ్య ఏదైనా చేస్తారని చెప్పడానికి ఇదే నిదర్శనం, ఇది కదా మేం కోరుకుంది, ఈ లుక్‌లో అదరగొడుతున్నార’ని కామెంట్స్‌ పెడుతున్నారు. మరి అభిమానులు అనుకుంటున్నట్లు బోయపాటి చిత్రం కోసం ఇలా తన లుక్‌ మార్చారా? వ్యక్తిగతంగా కొత్త లుక్‌ ప్రయత్నించారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరిన్ని

ఫేస్‌‘బుక్‌ చేస్తాడు’ [08:13]

ఫేస్‌బుక్‌ ద్వారా మహిళల సమాచారం సేకరిస్తాడు. వారి ఫోన్‌ నంబర్లు తెలుసుకుని మాట కలుపుతాడు. బంగారం వ్యాపారినంటూ ఆశ చూపుతాడు. వలలో పడ్డాక అసలు రంగు బయటపెడతాడు.. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వంద మంది

నాన్నా.. నిను మరవలేకున్నా.. [08:23]

ఇద్దరూ కుమార్తెలే.  తల్లి పేగుతెంచుకుని, తండ్రి ప్రేమను పంచుకుని జన్మించిన వారే. ఓ కుమార్తె మాత్రం తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయింది. ‘‘నాన్న లేని ఈ జన్మ ఎందుకు’’ అనుకుంది. తండ్రికి ఏకంగా తన  ప్రాణాన్నే నివాళిచ్చేందుకు ప్రయత్నించింది. మరో కుమార్తె మాత్రం అనుబంధాన్ని అపహాస్యం చేసింది. ఆస్తి పంచలేదన్న అక్కసుతో మరణించిన తల్లికి తన ఇంట్లో కాస్త చోటూ కల్పించడానికి నిరాకరించింది. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనలివి.

‘శ్రీరెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరం’ [08:34]

చిత్ర పరిశ్రమలో కొందరు కథానాయకులు, నటులతోపాటు తనను కూడా లక్ష్యంగా చేసుకుని నటి శ్రీరెడ్డి అసభ్య వ్యాఖ్యలు చేస్తోందని కరాటే కల్యాణి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌ వేదికగా తనను తిడుతూ ప్రత్యక్ష

ఉరేసుకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య [08:49]

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని జి సిగడాం ప్రాంతానికి చెందిన పి.ఎన్‌.వి.ఎస్‌ సన్నిబాబు(33) కొంత కాలంగా సుదర్శనగర్‌ కాలనీలో నివాసముంటూ ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

రాహుల్ మెరిశాడు.. పంత్ మురిపిస్తాడా? [08:03]

‘‘గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస.. గర్జన కన్నా ఎంతో భయంకరంగా ఉంటుంది’’.. ఈ డైలాగ్‌ టీమ్ఇండియా బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌కు సరిగ్గా సరిపోతుంది. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం టెస్టుల్లో చోటు కోల్పోయిన తర్వాత నుంచి

మియాపూర్‌లో కారు బీభత్సం [07:52]

హైదరాబాద్‌ మియాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వాహనాలను ఢీకొట్టి సమీపంలోని హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హోటల్‌లో కూర్చున్న అప్జల్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నలుగురు

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..ముగ్గురు ఉగ్రవాదులు హతం [07:40]

జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. పుల్వామా జిల్లా త్రాల్‌ సెక్టార్‌లోని...........

అపాయంలో ఆపద్బాంధవుడు! [07:29]

అతడు శ్రీమంతుడేమీ కాదు.. సాధారణ ఆటోడ్రైవర్‌. కానీ, తనకు ఉన్నంతలో ఎదుటివారిని ఆదుకునే మనసున్నవాడు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించేవాడు. నగరంలో ఎప్పుడు ఎవరికి ఆటో అత్యవసరమైనా డబ్బులు

పుట్టిన రోజన్నాడు.. రక్తపు మడుగులో కనిపించాడు [07:14]

అనుమానాస్పద స్థితిలో 12వ తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన బేగంపేట పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ః పోలీసుల కథనం ప్రకారం.. బేగంపేటలోని యూఎస్‌ కాన్సులేట్‌ సమీపంలోని క్రిషే గార్డెన్‌ అపార్ట్‌మెంట్స్‌ భవనం పైనుంచి కింద పడి ఓ బాలుడు పడినట్లు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ముసుగు దొంగల బీభత్సం [07:03]

పంజాగుట్ట అపరాజిత కాలనీలోని ఓ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున  ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు బీభత్సం సృష్టించారు. గడియను సులువుగా తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన వీరు.. బంగారు, నగదు పెద్దమొత్తంలో లేకపోవడంతో