దేవాలయాల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న మంచిర్యాల ఏసీపీ గౌస్‌బాబా

మంచిర్యాలనేరవిభాగం, న్యూస్‌టుడే: మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని దేవాలయాల్లో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు మంచిర్యాల ఏసీపీ ఎండీ గౌస్‌బాబా తెలిపారు. మంచిర్యాల ఏసీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా అంతర్‌గాం మండలానికి చెందిన మడక నర్సయ్య, గొర్రె కన్నయ్య గత కొద్దిరోజులుగా రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని జూలపల్లి, ధర్మారం, హాజీపూర్‌, సీసీసీ, రామకృష్ణాపూర్‌లోని దేవాలయాల్లో చోరీలకు పాల్పడి వెండి ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్తున్నారు. గురువారం ఉదయం సీసీసీలో గస్తీ కాస్తున్న పోలీసులకు ఆదిపరాశక్తి ఆలయం వద్ద నర్సయ్య, కన్నయ్యలు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. అదుపులోకి తీసుకున్న నిందితులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా పలు ఆలయాల్లో చోరీకి పాల్పడినట్లు తేలింది. వీరి వద్ద ఆరు వెండి ఆభరణాలు, రూ.770 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో నర్సయ్య 24 దొంగతనాల్లో పాతనేరస్థుడు కాగా ఇతడిపై పీడీ చట్టం కూడా అమలు చేశారు. జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్ధేశంతో నిందితులు దేవాలయాల్లో దొంగతనాలు చేసిన అనంతరం విజయవాడ రైల్వేస్టేషన్‌లో తలదాచుకునేవారని ఏసీపీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంచిర్యాల గ్రామీణ సీఐ కృష్ణకుమార్‌, సీసీసీ ఎస్సై ప్రమోద్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని

పెళ్లి బహుమతిగా ఉల్లి.. [12:50]

ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో  ధరల పెరుగుదలపై ప్రజలు పలురూపాల్లో ....

తిరుపతిలో బాలికపై అత్యాచారం:ఇద్దరి అరెస్ట్‌ [13:36]

దేశంలో మహిళలపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన దిశ ఘటనను మరవక ముందే తిరుపతిలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

టాప్‌ 10 న్యూస్ @ 9 PM [21:00]

మహిళలపై జరుగుతున్న దురాగతాలను అరికట్టడానికి కొత్త చట్టాలను తీసుకురావడమొక్కటే పరిష్కారం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందుకు రాజకీయ సంకల్పం, పాలనా నైపుణ్యాలు అవసరమని అభిప్రాయపడ్డారు. అప్పుడే ఇలాంటి...

‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’ [20:42]

నా చుట్టూ మంటలు అలముకున్నాయి. మహా అయితే రెండు మూడు నిమిషాలు బతుకుతా. నేను చెప్పదలచుకున్నది ఒకటే.. నా కుటుంబాన్ని చక్కగా చూసుకో’’ అంటూ దిల్లీ అగ్నిప్రమాద....

మహేశ్‌-విజయశాంతి ఇది గమనించారా? [20:27]

మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథనాయిక.

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు [20:14]

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం  ప్రశ్నోత్తరాల తర్వాత జరిగే...

మద్యాన్ని ఆదాయవనరుగా భావించం:ఏపీమంత్రి [20:06]

సమాజంలో ఎన్నో అనర్థాలకు మద్యమే కారణమని.. మూడేళ్లలో రాష్ట్రం నుంచి మద్యాన్ని వెలివేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో

బాలయ్య సరసన రష్మి [19:54]

మాస్‌లో నందమూరి బాలకృష్ణకు ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రాలు ‘సింహా’, ‘లెజెండ్‌’. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాలు నటుడిగా ...

బిగ్‌బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌ [19:41]

ఉమెన్స్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌ హీట్‌ ఉమెన్‌ జట్టు నిలిచింది. వరుసగా రెండు సీజన్లో టైటిల్‌ సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ ఉమెన్‌ జట్టుపై బ్రిస్బేన్‌ హీట్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం

చట్టాల సవరణలకు సంకల్పించాం: అమిత్‌షా [19:29]

హత్యాచారం వంటి తీవ్ర నేరాల్లో న్యాయం ఆలస్యం అవుతుండడంతో ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలను సవరించాలని ప్రభుత్వం సంకల్పించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు.