తొలిసారి ఓ మగాడికి జోడీగా నటించా

వరలక్ష్మి శరత్‌కుమార్‌పై తమిళ నటుడి వ్యాఖ్య

చెన్నై: ప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌పై తమిళ నటుడు విమల్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ జంటగా నటించిన చిత్రం ‘కాన్ని రాశి’. ముత్తుకుమారన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా వరలక్ష్మి, విమల్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి తన పెళ్లి గురించి ప్రస్తావించారు. 

‘నేనే ప్రేమ వివాహం చేసుకుంటానా?పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానా? అన్న విషయం పక్కన పెడితే నాకు అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు’ అన్నారు. అనంతరం విమల్‌ మాట్లాడుతూ.. ‘నేను తొలిసారి ఓ మగాడికి జోడీగా నటించాను’ అనేశారు. ఆ తర్వాత తనని తాను సమర్ధించుకుంటూ.. ‘అంటే నా ఉద్దేశం అది కాదు. ఆమెతో కలిసి పనిచేయడంలో నేను ఎలాంటి ఇబ్బందికి గురికాలేదు. ఆమె పాత్ర చాలా సహజంగా ఉంటుంది. కెమెరా ఆన్‌ అవగానే తన పాత్రలో లీనమైపోతారు’ అని వెల్లడించారు విమల్‌.

మరిన్ని

ఆ మాత్రం ఫిట్‌గా [07:58]

‘ఇమైకా నొడిగల్‌’, ‘అడంగమరు’, ‘అయోగ్య’, ‘సంగ తమిళన్‌’ చిత్రాల్లో నటించి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి రాశీ ఖన్నా. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అమ్మడు మాట్లాడుతూ ‘లావుగా ఉంటే దర్శకులు అవకాశాలు ఇవ్వరు.

సుభాస్కరన్‌ బయోపిక్‌కు పోటీ [09:24]

ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోని ‘కత్తి’ చిత్రంతో నిర్మాతగా అడుగుపెట్టారు లైకా ప్రొడక్షన్స్‌ అధినేత సుభాస్కరన్‌. ఆ తర్వాత ‘కోలమావు కోకిల’, ‘సెక్క చివంద వానం’, ‘వడ చెన్నై’, ‘2.ఓ’, ‘కాప్పాన్‌’ చిత్రాలు నిర్మించారు.

అందుకే ‘జెర్సీ’ నుంచి తప్పుకున్నాను: రష్మిక [11:24]

‘ఛలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హాలో చెప్పిన నటి రష్మిక. ‘గీత గోవిందం’ చిత్రంతో సినీ ప్రేక్షకులతో ముద్దుగా ‘మేడమ్‌’ అనిపించుకున్నారు ఈ నటి. తాజాగా ఈ భామ తెలుగులో సూపర్‌ హిట్టైన ‘జెర్సీ’ సినిమా బాలీవుడ్‌ రీమేక్‌లో నటించేందుకే నో చెప్పారు. అడిగినంత పారితోషికం ఇవ్వకపోవడంతోనే రష్మిక ‘జెర్సీ’ రీమేక్‌లో నటించడానికి అంగీకరించలేదంటూ పలువురు మాట్లాడుకున్నారు.

అనుమానాలు ఉంటే వీడియోను చూడండి.. [17:44]

తనకు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అంటే ఎంతో అభిమానమని నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్‌ తెలిపారు. సూపర్‌ స్టార్‌పై ఉన్న అభిమానంతో

గచ్చిబౌలి స్టేడియంలో ‘వెంకీమామ’ సందడి [21:16]

అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ ఆదివారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేశారు. ఇండియన్‌ సూపర్‌లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌ ఎఫ్‌సీ×ఎఫ్‌సీ...

మహేశ్‌-విజయశాంతి ఇది గమనించారా? [20:27]

మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథనాయిక.

బాలయ్య సరసన రష్మి [19:54]

మాస్‌లో నందమూరి బాలకృష్ణకు ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రాలు ‘సింహా’, ‘లెజెండ్‌’. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాలు నటుడిగా ...

కరణ్‌ డైరెక్షన్‌లో ఆ జోనర్‌లో నటించాలని ఉంది [19:16]

ఈ ఏడాది విడుదలైన ‘కబీర్‌ సింగ్‌’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు నటి కియారా ఆడ్వాణీ. ప్రస్తుతం ఆమె కరణ్‌ జోహార్‌ నిర్మాతగా...

ఏదో ఒక రోజు బాలీవుడ్‌ సినిమాలో చూస్తారు [16:48]

హాలీవుడ్‌ యాక్షన్‌ కథానాయకుడు డ్వేన్‌ జాన్సన్‌ హిందీ సినిమాలో నటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడా? అంటే అవుననే సమాధానం వినపడుతోంది

‘ఎంత మంచివాడవురా’ ఫస్ట్‌సాంగ్‌ వచ్చేసింది [16:13]

‘మనుషులం మనందరం ఏకాకులం కాదే ఎవ్వరం. మంచితనం మన గుణం పరస్పరం సాయం కాగలం’ అని అంటున్నారు కల్యాణ్‌ రామ్‌.