ద్రవిడ్‌కు ఊరట! ‘కేసు’ క్లియర్‌ చేసిన సీఓఏ

ముంబయి: టీమిండియా మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌పై పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసును క్రికెట్‌ పాలకుల కమిటీ మంగళవారం క్లియర్‌ చేసింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) క్రికెట్‌ హెడ్‌ బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం సుగమం చేసింది. బంతి ఇప్పుడు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ కోర్టులో ఉందని సీఓఏ సభ్యుడు లెఫ్టినెంట్‌ జనరల్‌ రవి తొగ్డె అన్నారు.

‘ద్రవిడ్‌ కేసులో విరుద్ధ ప్రయోజనాల అంశమేమీ లేదు. అతడికి నోటీసులు అందాయి. మేం ఆయన నియామకాన్ని క్లియర్‌ చేశాం. మాకు వివాదమేమీ కనిపించలేదు. అంబుడ్స్‌మన్‌ ఏమైనా గుర్తిస్తే మాకు ఎందుకు కనిపించలేదో అప్పుడు వివరిస్తాం. ఆ తర్వాత జైన్‌ దానిని పరిగణనలోకి తీసుకుంటారు. ఇదంతా ఓ ప్రక్రియ. ఇదిలా కొనసాగుతుంది’ అని రవి తొగ్డె వెల్లడించారు.

భారత్‌-ఏ, అండర్‌-19 కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ను ఎన్‌సీఏ క్రికెట్‌ హెడ్‌గా నియమించారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాని ఎన్‌.శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌లో ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో ద్రవిడ్‌కు పరస్పర విరుద్ధ ప్రయోజనాల నోటీసులు పంపించారు. భారత క్రికెట్‌లో అత్యంత గౌరవించే అతడికి నోటీసులు ఇవ్వడంతో గంగూలీ సహా ఇతర క్రికెటర్లు భగ్గుమన్నారు.

ఈ రోజు జరిగిన సీఓఏ సమావేశానికి ముందే డీకే జైన్‌కు ద్రవిడ్‌ తన వివరణ పంపించారు. ఐతే ఇండియా సిమెంట్స్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారో లేదో తెలియలేదు. క్రికెట్‌ హెడ్‌గా తన పదవీ కాలం ముగిసే వరకు సుదీర్ఘ సెలవు తీసుకున్నారని సమాచారం. క్రికెట్‌ అకాడమీని ద్రవిడ్‌ అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని తొగ్డె ఆశించారు. ఆయన దార్శనికతకు సంపూర్ణ మద్దతు అందిస్తామని వెల్లడించారు.

మరిన్ని

10 ఏళ్ల తర్వాత టెస్టుల్లోకిఎంపికైన క్రికెటర్‌ [01:23]

పాకిస్థాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ ఫవాద్‌ ఆలమ్‌ సంచలనం సృష్టించాడు. దాదాపు పదేళ్ల తర్వాత జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు అతడిని జట్టులోకి తీసుకున్నారు. దేశవాళీ క్రికెట్లో ఈ మధ్య కాలంలో భారీ పరుగులు......

మా సంజుకు చోటివ్వరా..: కేరళీయుల ఆందోళన [11:39]

సంజు శాంసన్‌. టీమిండియాలో చోటు కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న యువ ఆటగాడు. 2015లో జింబాబ్వేతో అరంగేట్రం చేసిన అతడికి రెండో అవకాశం దక్కనేలేదు. బంగ్లాదేశ్‌ సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికీ మూడు టీ20ల్లో శీతల....

శివమెత్తిన శివమ్‌ [21:02]

శివమ్‌ దూబే (54, 30 బంతుల్లో 3×4, 4×6) రాణించడంతో వెస్టిండీస్‌కు భారత్‌ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. భారత్‌కు

బిగ్‌బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌ [19:41]

ఉమెన్స్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌ హీట్‌ ఉమెన్‌ జట్టు నిలిచింది. వరుసగా రెండు సీజన్లో టైటిల్‌ సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ ఉమెన్‌ జట్టుపై బ్రిస్బేన్‌ హీట్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌ [18:40]

భారత్×వెస్టిండీస్‌ రెండో టీ20కి రంగం సిద్ధమైంది. తిరువనంతరపురం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమ్‌ఇండియా

అగ్రస్థానం కోసం కోహ్లీ×రోహిత్‌ పోటీ! [16:25]

వెస్టిండీస్‌తో జరగనున్న రెండో టీ20లో భారత ఆటగాళ్లు అరుదైన రికార్డులపై కన్నేశారు. పొట్టిఫార్మాట్‌లో 400 సిక్సర్ల క్లబ్‌లో చేరడానికి టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ సిక్సర్‌ దూరంలో మాత్రమే నిలిచాడు. హిట్‌మ్యాన్‌ మరో సిక్సర్ బాదితే

‘300’ మిస్‌! [10:52]

రికార్డులున్నవి బద్దలు కొట్టేందుకే. ఘనతలున్నవి తిరగరాసేందుకే. ఐతే వ్యక్తిగత మైలురాళ్ల కన్నా జట్టు ప్రయోజనాలు అత్యంత ముఖ్యం. త్రిశతకం సాధించిన డేవిడ్‌ వార్నర్‌ రికార్డును అడ్డుకోవడమూ అలాంటిదే. వాస్తవానికి మ్యాచుకు సిసలైన గమ్యం గెలుపే.

అశ్విన్‌ రికార్డును సమం చేసిన చాహల్‌ [01:23]

వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌తో సమంగా నిలిచాడు. విండీస్‌ బ్యాట్స్‌మెన్‌

థాంక్యూ బిగ్‌బాస్‌: కోహ్లీ [01:23]

‘ఛేదన రారాజు’ విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ విన్యాసానికి టీమిండియా తన చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. వెస్టిండీస్‌ నిర్దేశించిన 208 పరుగులను లక్ష్యాన్ని మరో 8 బంతులుండగానే ముగించింది. మొదట్లో....

దక్షిణాఫ్రికా క్రికెట్‌కు పీటర్సన్‌ సలహా [01:23]

గత కొంత కాలంగా దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు తమ పోరాట పటిమ చూపలేకపోతుంది. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో, భారత పర్యటనలో పేలవ ప్రదర్శన చేసి ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. సీనియర్‌ ఆటగాళ్లు దూరమవ్వడంతో జట్టు