కార్స్‌24లో ఎంఎస్‌ ధోనీ పెట్టుబడి

ముంబయి: టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ మరో వ్యాపారంలో అడుగుపెట్టాడు. గురుగ్రామ్‌ కేంద్రంగా నడిచే కార్స్‌24 సంస్థలో పెట్టుబడి పెట్టాడు. తమ బ్రాండ్‌ విలువను పెంచుకొనేందుకు, దేశవ్యాప్తంగా వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ఆయనతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నామని కార్స్‌24 వెల్లడించింది. ఆ సంస్థలో ధోనీ కొంతమేర వాటా సొంతం చేసుకోవడమే కాకుండా ప్రచారకర్తగా వ్యవహరిస్తాడు. ఐతే మహీ పెట్టుబడి విలువెంతో బహిర్గతం చేయలేదు.

‘కార్స్‌24 ప్రయాణంలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. కార్ల విషయాన్ని పక్కన పెడితే సృజనాత్మక, నవ కల్పనలు చేసే కొత్తతరం సంస్థలను నేనెంతో ఇష్టపడతాను. కార్స్‌24 అందులో ఒకటి. వారికెన్నో భారీ లక్ష్యాలు ఉన్నాయి. వాటిని చేరుకొనేందుకు నావంతు సహాయం చేస్తా’ అని ధోనీ అన్నాడు.

‘కార్స్‌24 కుటుంబంలోకి మహీని స్వాగతించేందుకు ఎంతో ఆత్రుతగా ఉన్నాం. చాలామంది భారతీయులకు ఆయన రోల్‌మోడల్‌. తన నాయకత్వ ప్రతిభతో భారత క్రికెట్‌ చరిత్రలో గొప్ప సారథిగా పేరుపొందాడు. కార్స్‌24లోనూ ఆయన పాటించిన విలువలే పాటిస్తాం. అందుకే మా భాగస్వామ్యం స్వచ్ఛమైంది. సహజమైంది. మేమంతా కార్లంటే పడిచస్తాం’ అని కార్స్‌24 సీఈవో విక్రమ్‌ చోప్రా అన్నారు. 2021 కల్లా 300+ టైర్‌ 2, టైర్‌ 3 పట్టణాల్లో ఫ్రాంచైజీలు విస్తరించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. పాత కార్ల కొనుగోలు, విక్రయాలకు దేశంలోని అతిపెద్ద వేదికల్లో కార్స్‌24 ఒకటి.

మరిన్ని

రూ.10వేలలోపు ఆ ఫీచర్‌ ఉన్న తొలి ఫోన్‌ ఇదే! [00:18]

ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌ వరుస మొబైల్‌ ఫోన్లతో మార్కెట్‌లో దూసుకుపోతుంది. మంగళవారం మిడ్‌ రేంజ్‌లో రియల్‌ మి మరో రెండు స్మార్ట్‌  ఫోన్లను..

20ఏళ్ల తర్వాత అవే లక్షణాలతో.. [00:19]

దాదాపు 20 ఏళ్ల క్రితం రుణ సంక్షోభం తర్వాత మళ్లీ ఆసియా మార్కెట్లలో సంక్షోభ లక్షణాలు కనిపిస్తున్నాయని ప్రముఖ కన్సల్టెంగ్‌ ఏజెన్సీ మెకెన్సీ...

ఆల్‌టైం రికార్డు స్థాయికి పెరిగిన బంగార ధర [00:19]

బంగారం ధర రోజు రోజుకీ కొత్త గరిష్ఠాలను చేరుతోంది. పది గ్రాముల పసిడి రూ.40వేలకు చేరువగా వెళ్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాటి బులియన్‌ ట్రేడింగ్‌లో

సీజీ పవర్‌లో అవకతవకలు..! [00:18]

గౌతమ్‌ థాపర్‌ ప్రమోట్‌ చేస్తున్న సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ సొల్యూషన్స్‌లో ఆర్థిక అవక తవకలు జరిగినట్లు బోర్డు గుర్తించింది. ఈ విషయాన్ని బోర్డు నేడు ఎక్స్‌ఛేంజి ఫైలింగ్‌లో పేర్కొంది. దీంతో ఈ కంపెనీ