ఒక్కడితోనే విమానం బయల్దేరింది!

ఇంటర్నెట్‌ డెస్క్: ఎప్పుడైనా మీరు విమాన ప్రయాణం చేశారా..? అంటే చాలా మంది చేశామని అంటారు. కానీ ఒంటరిగా విమానంలో ప్రయాణించారా అంటే అవునని చెప్పే వాళ్లు చాలా తక్కువ. కానీ న్యూయార్క్‌లో ఒక వ్యక్తి అనుకోకుండా అలాంటి అవకాశాన్ని కొట్టేశాడు. అతడు బుక్‌ చేసుకున్న విమానంలో ప్రయాణించేందుకు వేరెవరూ టికెట్‌ తీసుకోకపోవడంతో ఒక్కడే ప్రయాణించే అవకాశాన్ని పొందగలిగాడు. 
వివరాల్లోకి వెళ్తే.. న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ రచయిత, దర్శకుడు విన్సెంట్‌ పియోన్‌ కొలరాడోలోని ఆస్పెన్‌ నుంచి సాల్ట్‌లేక్‌ సిటీలోని తన ఇంటికి వెళ్లేందుకు బయల్దేరాడు. ఈ క్రమంలో విమానాశ్రయానికి వెళ్లిన పియోన్‌కు డెల్టా విమానంలో ప్రయాణించడానికి టికెట్‌ బుక్‌ చేసుకున్నది తానొక్కడిననే విషయం తెలియదు. విమానాశ్రయంలోకి వెళ్లగానే బోర్డింగ్‌ వద్ద సిబ్బంది ఈ విమానంలో ప్రయాణించే వ్యక్తి మీరు ఒక్కరే అని చెప్పడంతో అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఒక్కడినే ప్రయాణించబోతున్నానని తెలిసి తన ఒంటరి ప్రయాణాన్ని వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పియోన్‌.. ‘సిబ్బంది నన్ను విమానం వద్దకు తీసుకెళ్తుంటే.. గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా చూశారా అని వారిని అడిగాను. గతంలో కొన్ని సందర్భాల్లో జరిగాయని సమాధానమిచ్చారు. ఆ తర్వాత నేనొక్కడినే ప్రయాణికుడిని కావడంతో కార్గో సిబ్బంది విమానంలో బరువు ఉండటానికి ఇసుక సంచులు వేయడం గమనించాను. అనంతరం లోపలకు వెళ్లగానే ఒక్కడినే అయినా నాకు స్వాగతం పలికారు. ఇవన్నీ చూసి గొప్ప అనుభూతికి లోనయ్యా’ అని వివరించాడు. విమానంలో ప్రయాణించిన వీడియోను పియోన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది.

 


మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

కేసీఆర్‌కు రసాయనాల సీసా పార్శిల్‌ [07:13]

అది సికింద్రాబాద్‌ ప్రధాన తపాలా కార్యాలయం.. అక్కడ ఒకే తరహా పెట్టెలు అరవైకి పైగా ఉన్నాయి. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాటిపై బట్వాడా చేయాల్సిన చిరునామాలను చూసి సిబ్బంది నిర్ఘాంతపోయారు.

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:01]

‘వేదిక ఏదైనా సరే..పాక్‌ను ఎదుర్కొంటాం’ [08:50]

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపైన ఎండగట్టడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ..................

పందెంలో పావురాలు! [08:43]

కోళ్ల పందేలు.. ఎద్దుల పోటీలు చాలా చూశాం. మరి పావురాల పోటీ పెడితే ఎలా ఉంటుంది? చెన్నైలో అదే చేశారు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

గంజాయి అమ్మిన చేతులతో ఉప్పు వ్యాపారం [08:22]

గంజాయి వ్యాపారిలో పరివర్తన తీసుకొచ్చి కొత్త జీవితం ప్రారంభించడానికి తోడ్పాటు అందించారు మదురై పోలీసులు.....