టీవీ ఛానల్‌ రిపోర్టర్‌ ఆత్మహత్యాయత్నం

బాలాపూర్‌, న్యూస్‌టుడే: ఓ గొడవకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేకున్నా బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ స్టేషన్‌కు పిలిచి అవమానించారని మనస్తాపానికి గురైన ఓ టీవీ ఛానల్‌ రిపోర్టర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మల్లాపూర్‌కు చెందిన శ్రీనివాస్‌ ఓ ఛానల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి ఓ దుకాణంలో జరిగిన గొడవకు తనకు సంబంధం ఉందని, అతన్ని అవమానపరుస్తూ పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టినట్లు ఆయన తెలిపాడు. గొడవతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పినా ఇన్‌స్పెక్టర్‌ సైదులు వినిపించుకోకుండా అనుమానం వ్యక్తం చేస్తూ కించపరిచారని వాపోయాడు.  పోలీసులు అవమానించారంటూ మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వీడియోను వాట్సాప్‌లో పెట్టాడు. అనంతరం ట్యాంక్‌ పైకెక్కి పెట్రోల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్‌ ఐసీయూలో ఉన్నట్లు భార్య లావణ్య తెలిపారు. ఈ విషయమై ఇన్‌స్పెక్టర్‌ను వివరణ కోరగా గొడవలో అతని పాత్ర ఉందని తెలియడంతో పిలిచి సమాచారం అడిగి పంపించామని, అవమానించలేదని వివరించారు.

మరిన్ని

పెళ్లి బహుమతిగా ఉల్లి.. [12:50]

ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో  ధరల పెరుగుదలపై ప్రజలు పలురూపాల్లో ....

తిరుపతిలో బాలికపై అత్యాచారం:ఇద్దరి అరెస్ట్‌ [13:36]

దేశంలో మహిళలపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన దిశ ఘటనను మరవక ముందే తిరుపతిలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

సైబరాబాద్‌ పోలీస్‌ వాట్సప్‌ నిలిపివేత [22:12]

సైబరాబాద్‌ పోలీసుల వాట్సప్‌ నంబరును వాట్సప్‌ సంస్థ నిలిపివేసింది. దిశ ఘటన తర్వాత 9490617444 నంబరు పై ఉన్న వాట్సప్ కు సందేశాల..

అరుదైన ఫొటోలు ట్వీట్‌ చేసిన కేటీఆర్‌ [21:58]

ఎప్పుడూ అధికారిక, పార్టీ కార్యక్రమాలతో బిజీగా గడిపే మంత్రి కేటీఆర్.. ట్విటర్‌లోనూ యాక్టివ్‌గా ఉంటారు. అభివృద్ధి, రాజకీయ

త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్‌ [21:46]

భాగ్యనగర వాసులకు మరో మెట్రో రైలు కారిడార్‌ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే హైదరాబాద్‌ వాసులకు మొదటి కారిడార్‌ మియాపూర్‌ నుంచి...

త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు! [21:31]

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భాజపా సీనియర్‌ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులు వైకాపా తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు...

గచ్చిబౌలి స్టేడియంలో ‘వెంకీమామ’ సందడి [21:16]

అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ ఆదివారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేశారు. ఇండియన్‌ సూపర్‌లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌ ఎఫ్‌సీ×ఎఫ్‌సీ...

శివమెత్తిన శివమ్‌ [21:02]

శివమ్‌ దూబే (54, 30 బంతుల్లో 3×4, 4×6) రాణించడంతో వెస్టిండీస్‌కు భారత్‌ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. భారత్‌కు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM [21:00]

మహిళలపై జరుగుతున్న దురాగతాలను అరికట్టడానికి కొత్త చట్టాలను తీసుకురావడమొక్కటే పరిష్కారం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందుకు రాజకీయ సంకల్పం, పాలనా నైపుణ్యాలు అవసరమని అభిప్రాయపడ్డారు. అప్పుడే ఇలాంటి...

‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’ [20:42]

నా చుట్టూ మంటలు అలముకున్నాయి. మహా అయితే రెండు మూడు నిమిషాలు బతుకుతా. నేను చెప్పదలచుకున్నది ఒకటే.. నా కుటుంబాన్ని చక్కగా చూసుకో’’ అంటూ దిల్లీ అగ్నిప్రమాద....