సచిన్‌కు ఈ రోజు ఎంతో ప్రత్యేకం!

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ దిగ్గజాలు డాన్‌ బ్రాడ్‌మన్‌, సచిన్‌కు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైంది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ డాన్ బ్రాడ్‌మన్‌ తన ఆట తీరుతో క్రికెట్‌ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నారు. 52 టెస్టులు ఆడిన ఆయన 99.94 సగటుతో 6996 పరుగులు సాధించారు. ఇందులో 29 సెంచరీలు ఉన్నాయి. ఆయన ఆటకు స్వస్తిపలికి 71 ఏళ్లు అవుతున్నా సగటు రికార్డు మాత్రం పదిలంగానే ఉంది. అంతటి మహా దిగ్గజం బ్రాడ్‌మన్‌ ఆఖరిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాట్‌ పట్టింది ఆగస్టు 14నే. 1948 ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్‌ సిరీస్‌లోని ఆఖరి మ్యాచ్‌తో ఆయన కెరీర్‌ను ముగించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకొని 52 పరుగులకే కుప్పకూలింది. అనంతరం వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన బ్రాడ్‌మన్‌ తొలి బంతిని డిఫెండ్‌ చేశారు. రెండో బంతిని అంచనా వేయడంలో విఫలమై క్లీన్‌బౌల్డయ్యారు. అయినా ఇతర ఆటగాళ్లు రాణించడంతో ఈ మ్యాచ్‌ను ఆసీస్‌ గెలిచింది. ఇలా క్రికెట్‌లో డాన్‌ ప్రస్థానం ముగిసింది. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు వారి క్యాప్‌లను తీసి బ్రాడ్‌మన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.

క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ తెందుల్కర్‌కు కూడా ఈ రోజు ఎంతో ప్రత్యేకమైంది. శతక శతకాలు బాదిన సచిన్‌ టెస్టుల్లో తొలి సెంచరీని ఆగస్టు 14వ తేదీనే బాదాడు. 1990లో జరిగిన భారత్‌xఇంగ్లాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ తొలిసారిగా మూడంకెల స్కోరుని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 68 పరుగులే బాదిన లిటిల్‌ మాస్టర్‌ రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 119 పరుగులు చేశాడు. 127 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును 343/6తో పటిష్ఠ స్థితిలో నిలిచేలా చేశాడు. దీంతో భారత్‌ టెస్టును డ్రాగా ముగించింది.

ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ బ్రాడ్‌మన్‌ 2000 డిసెంబరులో ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన డాన్‌ 92 ఏళ్ల వయసులో 2001 ఫిబ్రవరి 25న తుది శ్వాస విడిచారు. 1998 ఆగస్టు 27న డాన్‌ బ్రాడ్‌మన్‌ తన 90వ పుట్టిన రోజు నాడు తనకెంతో ఇష్టమైన ఆటగాళ్లు సచిన్‌‌, షేన్‌ వార్న్‌ను ఇంటికి ఆహ్వానించారు.

మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

కేసీఆర్‌కు రసాయనాల సీసా పార్శిల్‌ [07:13]

అది సికింద్రాబాద్‌ ప్రధాన తపాలా కార్యాలయం.. అక్కడ ఒకే తరహా పెట్టెలు అరవైకి పైగా ఉన్నాయి. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాటిపై బట్వాడా చేయాల్సిన చిరునామాలను చూసి సిబ్బంది నిర్ఘాంతపోయారు.

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:01]

‘వేదిక ఏదైనా సరే..పాక్‌ను ఎదుర్కొంటాం’ [08:50]

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపైన ఎండగట్టడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ..................

పందెంలో పావురాలు! [08:43]

కోళ్ల పందేలు.. ఎద్దుల పోటీలు చాలా చూశాం. మరి పావురాల పోటీ పెడితే ఎలా ఉంటుంది? చెన్నైలో అదే చేశారు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

గంజాయి అమ్మిన చేతులతో ఉప్పు వ్యాపారం [08:22]

గంజాయి వ్యాపారిలో పరివర్తన తీసుకొచ్చి కొత్త జీవితం ప్రారంభించడానికి తోడ్పాటు అందించారు మదురై పోలీసులు.....