భూకక్ష్యను వీడిన చంద్రయాన్‌-2

బెంగళూరు: ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-2 మిషన్‌లో ఇస్రో మరో మైలురాయిని అధిగమించింది. చంద్రయాన్‌-2 భూకక్ష్య వీడి జాబిల్లి కక్ష్య దిశగా విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ మేరకు కక్ష్యను పెంచే ప్రయోగాన్ని బుధవారం వేకువజామున 2.21గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. వ్యోమనౌకలోని ద్రవ ఇంజిన్‌ను 1203 సెకన్ల పాటు మండించి కక్ష్యను పెంచినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇది జాబిల్లి కక్ష్యకు చేరే ట్రాన్స్‌ ల్యూనార్‌ మార్గంలో పయనిస్తోంది. చంద్రయాన్‌-2 ప్రయోగం తర్వాత ఇప్పటి వరకు ఐదు సార్లు కక్ష్యను పెంచే ప్రక్రియను చేపట్టామని అవన్నీ విజయవంతమయ్యాయని తెలిపారు. 

ఇప్పటివరకు చంద్రయాన్‌-2 ఎలాంటి అవరోధం లేకుండా విజయవంతంగా ముందుకు దూసుకెళ్తోందని ఇస్రో ప్రకటించింది. వ్యోమనౌక పనితీరు సైతం మెరుగ్గా ఉందన్నారు. బెంగళూరు ఇస్రో మిషన్‌ ఆపరేషన్స్‌ కాంప్లెక్స్‌ నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ఈ నెల 20న చంద్రయాన్‌-2 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. దాని కోసం మరోసారి ద్రవ ఇంజిన్‌ను మండించాల్సి ఉంటుందన్నారు. అనంతరం జాబిల్లిపైకి దిగడానికి ముందు మరో నాలుగు కీలక ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-2 సెప్టెంబరు 7న జాబిల్లి ఉపరితలంపై దిగనున్న విషయం తెలిసిందే.


మరిన్ని

పెళ్లి బహుమతిగా ఉల్లి.. [12:50]

ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో  ధరల పెరుగుదలపై ప్రజలు పలురూపాల్లో ....

తిరుపతిలో బాలికపై అత్యాచారం:ఇద్దరి అరెస్ట్‌ [13:36]

దేశంలో మహిళలపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన దిశ ఘటనను మరవక ముందే తిరుపతిలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

శివమెత్తిన శివమ్‌ [21:02]

శివమ్‌ దూబే (54, 30 బంతుల్లో 3×4, 4×6) రాణించడంతో వెస్టిండీస్‌కు భారత్‌ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. భారత్‌కు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM [21:00]

మహిళలపై జరుగుతున్న దురాగతాలను అరికట్టడానికి కొత్త చట్టాలను తీసుకురావడమొక్కటే పరిష్కారం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందుకు రాజకీయ సంకల్పం, పాలనా నైపుణ్యాలు అవసరమని అభిప్రాయపడ్డారు. అప్పుడే ఇలాంటి...

‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’ [20:42]

నా చుట్టూ మంటలు అలముకున్నాయి. మహా అయితే రెండు మూడు నిమిషాలు బతుకుతా. నేను చెప్పదలచుకున్నది ఒకటే.. నా కుటుంబాన్ని చక్కగా చూసుకో’’ అంటూ దిల్లీ అగ్నిప్రమాద....

మహేశ్‌-విజయశాంతి ఇది గమనించారా? [20:27]

మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథనాయిక.

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు [20:14]

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం  ప్రశ్నోత్తరాల తర్వాత జరిగే...

మద్యాన్ని ఆదాయవనరుగా భావించం:ఏపీమంత్రి [20:06]

సమాజంలో ఎన్నో అనర్థాలకు మద్యమే కారణమని.. మూడేళ్లలో రాష్ట్రం నుంచి మద్యాన్ని వెలివేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో

బాలయ్య సరసన రష్మి [19:54]

మాస్‌లో నందమూరి బాలకృష్ణకు ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రాలు ‘సింహా’, ‘లెజెండ్‌’. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాలు నటుడిగా ...

బిగ్‌బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌ [19:41]

ఉమెన్స్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌ హీట్‌ ఉమెన్‌ జట్టు నిలిచింది. వరుసగా రెండు సీజన్లో టైటిల్‌ సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ ఉమెన్‌ జట్టుపై బ్రిస్బేన్‌ హీట్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం