ఆవులను స్కూల్‌కు తీసుకొచ్చిన రైతులు

భయాందోళనకు గురైన విద్యార్థులు 

సంభల్‌‌: వీధిలో తిరిగే ఆవులు పొలాల్లోకి చొరబడి తమ పంటలను నాశనం చేస్తున్నాయని ఆగ్రహించిన రైతులు వాటిని పాఠశాలకు తీసుకెళ్లారు. ఆవులన్నింటినీ పాఠశాల ప్రాంగణంలో తోలి  బయటి నుంచి తాళం వేశారు. దీంతో స్కూల్‌లో పాఠాలు వింటున్న విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు గురై పరుగులు తీశారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

సంభల్‌లోని గోన్‌హత్‌ గ్రామానికి చెందిన రైతులు మంగళవారం వీధుల్లో తిరిగే 200లకు పైగా ఆవులను స్థానిక ప్రభుత్వ పాఠశాలకు తీసుకొచ్చారు. ఈ ఆవులు తమ పంటలను నాశనం చేస్తుండటంతో వాటిని స్కూల్‌లోకి తోలి తాళం వేయడమే దీనికి పరిష్కారమని రైతులు భావించారు. అయితే అక్కడే చదువుకుంటున్న తమ పిల్లల గురించి వారు మర్చినట్లున్నారు. పాఠశాల గేటును తెరిచి ఆవులను ప్రాంగణంలోకి పంపించారు. ఆ తర్వాత బయటి నుంచి తాళం వేశారు. 

ఒక్కసారిగా వందల సంఖ్యలో ఆవులు స్కూల్‌ ప్రాంగణంలోకి రావడంతో ఆందోళనకు గురైన విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఉపాధ్యాయులు విద్యార్థులను గదుల్లోకి తీసుకెళ్లి తలుపులు వేసుకొన్నారు. సమాచారమందుకున్న స్థానిక విద్యాశాఖ అధికారి స్కూల్‌కు చేరుకుని రైతులతో మాట్లాడారు. అయితే రైతులు వాగ్వాదానికి దిగడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి రైతులకు నచ్చజెప్పి ఆవులను అక్కడి నుంచి పంపించారు. చిన్నారులను ప్రమాదంలో పడేసిన రైతులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

మరిన్ని

పెళ్లి బహుమతిగా ఉల్లి.. [12:50]

ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో  ధరల పెరుగుదలపై ప్రజలు పలురూపాల్లో ....

తిరుపతిలో బాలికపై అత్యాచారం:ఇద్దరి అరెస్ట్‌ [13:36]

దేశంలో మహిళలపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన దిశ ఘటనను మరవక ముందే తిరుపతిలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’ [20:42]

నా చుట్టూ మంటలు అలముకున్నాయి. మహా అయితే రెండు మూడు నిమిషాలు బతుకుతా. నేను చెప్పదలచుకున్నది ఒకటే.. నా కుటుంబాన్ని చక్కగా చూసుకో’’ అంటూ దిల్లీ అగ్నిప్రమాద....

మహేశ్‌-విజయశాంతి ఇది గమనించారా? [20:27]

మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథనాయిక.

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు [20:14]

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం  ప్రశ్నోత్తరాల తర్వాత జరిగే...

మద్యాన్ని ఆదాయవనరుగా భావించం:ఏపీమంత్రి [20:06]

సమాజంలో ఎన్నో అనర్థాలకు మద్యమే కారణమని.. మూడేళ్లలో రాష్ట్రం నుంచి మద్యాన్ని వెలివేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో

బాలయ్య సరసన రష్మి [19:54]

మాస్‌లో నందమూరి బాలకృష్ణకు ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రాలు ‘సింహా’, ‘లెజెండ్‌’. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాలు నటుడిగా ...

బిగ్‌బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌ [19:41]

ఉమెన్స్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌ హీట్‌ ఉమెన్‌ జట్టు నిలిచింది. వరుసగా రెండు సీజన్లో టైటిల్‌ సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ ఉమెన్‌ జట్టుపై బ్రిస్బేన్‌ హీట్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం

చట్టాల సవరణలకు సంకల్పించాం: అమిత్‌షా [19:29]

హత్యాచారం వంటి తీవ్ర నేరాల్లో న్యాయం ఆలస్యం అవుతుండడంతో ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలను సవరించాలని ప్రభుత్వం సంకల్పించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు.

కరణ్‌ డైరెక్షన్‌లో ఆ జోనర్‌లో నటించాలని ఉంది [19:16]

ఈ ఏడాది విడుదలైన ‘కబీర్‌ సింగ్‌’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు నటి కియారా ఆడ్వాణీ. ప్రస్తుతం ఆమె కరణ్‌ జోహార్‌ నిర్మాతగా...