రేపు అభినందన్‌కు వీర్‌చక్ర ప్రదానం

దిల్లీ: శత్రు సైనికుల చెరలో ఉన్నా.. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు రేపు ‘వీర్‌చక్ర’ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డును అందించనున్నారు. ఆయనతో పాటు ఐఏఎఫ్‌ స్క్వాడ్రన్‌ లీడర్‌ మింటీ అగర్వాల్‌కు యుద్ధసేవా పతకాన్ని ప్రదానం చేయనున్నారు. పలువురు జవాన్లకు శౌర్యచక్ర, కీర్తిచక్ర అవార్డులను కూడా అందించనున్నారు. 

ఈ ఏడాది ఫిబ్రవరి 26న బాలాకోట్‌ దాడి జరిగిన మరుసటి రోజు ఫిబ్రవరి 27న పాకిస్థాన్‌ విమానాలు మన దేశంపై దాడికి ప్రయత్నించాయి. ఆ సమయంలో పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్‌-16ను అభినందన్‌ తన మిగ్‌ విమానంతో కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మిగ్‌ కూడా కూలిపోవడంతో అభినందన్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో దిగారు. అక్కడి స్థానికులు ఆయనను పట్టుకుని పాక్‌ సైనికులకు అప్పగించారు. దౌత్య ఒత్తిడితో మూడు రోజుల తర్వాత అభినందన్‌ను దాయాది దేశం విడిచిపెట్టింది.

అయితే పాక్‌ సైనికులు ఎంత ఒత్తిడి చేసినా.. అభినందన్‌ మన సైన్యానికి సంబంధించిన రహస్యాలను వెల్లడించలేదు. శత్రువుల చెరలో ఉన్నప్పుడు కూడా ఎంతో ధైర్యంగా ఉన్నారు. అందుకుగానూ ఆయనను ప్రభుత్వం వీర్‌చక్రతో సత్కరించనుంది. జవాన్లకిచ్చే పరమ్‌వీర చక్ర, మహా వీరచక్ర తర్వాత మూడో అత్యున్నత పురస్కారం ఇది. 


మరిన్ని

పెళ్లి బహుమతిగా ఉల్లి.. [12:50]

ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో  ధరల పెరుగుదలపై ప్రజలు పలురూపాల్లో ....

తిరుపతిలో బాలికపై అత్యాచారం:ఇద్దరి అరెస్ట్‌ [13:36]

దేశంలో మహిళలపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన దిశ ఘటనను మరవక ముందే తిరుపతిలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

గచ్చిబౌలి స్టేడియంలో ‘వెంకీమామ’ సందడి [21:16]

అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ ఆదివారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేశారు. ఇండియన్‌ సూపర్‌లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌ ఎఫ్‌సీ×ఎఫ్‌సీ...

శివమెత్తిన శివమ్‌ [21:02]

శివమ్‌ దూబే (54, 30 బంతుల్లో 3×4, 4×6) రాణించడంతో వెస్టిండీస్‌కు భారత్‌ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. భారత్‌కు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM [21:00]

మహిళలపై జరుగుతున్న దురాగతాలను అరికట్టడానికి కొత్త చట్టాలను తీసుకురావడమొక్కటే పరిష్కారం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందుకు రాజకీయ సంకల్పం, పాలనా నైపుణ్యాలు అవసరమని అభిప్రాయపడ్డారు. అప్పుడే ఇలాంటి...

‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’ [20:42]

నా చుట్టూ మంటలు అలముకున్నాయి. మహా అయితే రెండు మూడు నిమిషాలు బతుకుతా. నేను చెప్పదలచుకున్నది ఒకటే.. నా కుటుంబాన్ని చక్కగా చూసుకో’’ అంటూ దిల్లీ అగ్నిప్రమాద....

మహేశ్‌-విజయశాంతి ఇది గమనించారా? [20:27]

మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథనాయిక.

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు [20:14]

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం  ప్రశ్నోత్తరాల తర్వాత జరిగే...

మద్యాన్ని ఆదాయవనరుగా భావించం:ఏపీమంత్రి [20:06]

సమాజంలో ఎన్నో అనర్థాలకు మద్యమే కారణమని.. మూడేళ్లలో రాష్ట్రం నుంచి మద్యాన్ని వెలివేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో

బాలయ్య సరసన రష్మి [19:54]

మాస్‌లో నందమూరి బాలకృష్ణకు ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రాలు ‘సింహా’, ‘లెజెండ్‌’. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాలు నటుడిగా ...