జమ్ములో ఆంక్షల ఎత్తివేత

కశ్మీర్‌లో యథాతథం

శ్రీనగర్: అధికరణ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో విధించిన ఆంక్షల్ని జమ్ము ప్రాంతంలో పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు జమ్ముకశ్మీర్‌ అదనపు డీజీపీ మునీర్‌ ఖాన్‌ తెలిపారు. కశ్మీర్‌లో మాత్రం మరికొన్ని రోజుల పాటు యథాతథ స్థితిని కొనసాగించనున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని స్పష్టం చేశారు. శ్రీనగర్‌ లాంటి ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ.. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదన్నారు. కొంతమందికి స్వల్ప గాయాలవ్వగా వారికి వెంటనే చికిత్స అందజేసే ఏర్పాట్లు చేశామన్నారు. సామాన్య ప్రజలకు ఎటువంటి హాని కలగొద్దన్న లక్ష్యంతోనే ఆంక్షలు విధించాల్సి వచ్చిందని వివరించారు. అనేక మంది ఇక్కడి శాంతిభద్రతలపై వదంతులను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ క్రమంలో 2016, 2010 నాటి ఉద్రిక్త పరిస్థితుల వీడియోలు, చిత్రాలను వ్యాప్తి చేస్తున్నారు. అటువంటి అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. నకిలీ వార్తల్ని నియంత్రించడానికి ప్రభుత్వం సైతం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు.

కశ్మీర్‌పై కీలక నిర్ణయాల నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్రం భారీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కట్టుదిట్టమైన భద్రత నడుమ సైనికులు నిత్యం పహారా కాస్తున్నారు. ఇంటర్నెట్‌, మొబైల్‌ సేవల్ని నిలిపివేశారు. ప్రముఖ రాజకీయ, వేర్పాటువాద నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడా భారీ ప్రదర్శనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో ఆంక్షల సడలింపు వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రానికి కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పరిస్థితులు చక్కబడుతున్న కొద్దీ దశలవారీగా ఆంక్షల్ని సడలిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. తాజాగా పరిస్థితులు మెరుగవడంతో జమ్ములో ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేశారు. శ్రీనగర్‌లో మాత్రం మరికొన్ని రోజుల పాటు ఆంక్షల్ని కొనసాగించనున్నారు.


మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

కేసీఆర్‌కు రసాయనాల సీసా పార్శిల్‌ [07:13]

అది సికింద్రాబాద్‌ ప్రధాన తపాలా కార్యాలయం.. అక్కడ ఒకే తరహా పెట్టెలు అరవైకి పైగా ఉన్నాయి. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాటిపై బట్వాడా చేయాల్సిన చిరునామాలను చూసి సిబ్బంది నిర్ఘాంతపోయారు.

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:01]

‘వేదిక ఏదైనా సరే..పాక్‌ను ఎదుర్కొంటాం’ [08:50]

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపైన ఎండగట్టడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ..................

పందెంలో పావురాలు! [08:43]

కోళ్ల పందేలు.. ఎద్దుల పోటీలు చాలా చూశాం. మరి పావురాల పోటీ పెడితే ఎలా ఉంటుంది? చెన్నైలో అదే చేశారు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

గంజాయి అమ్మిన చేతులతో ఉప్పు వ్యాపారం [08:22]

గంజాయి వ్యాపారిలో పరివర్తన తీసుకొచ్చి కొత్త జీవితం ప్రారంభించడానికి తోడ్పాటు అందించారు మదురై పోలీసులు.....