ఎన్నికల ప్రక్రియ గడువు ఎందుకు తగ్గించారు?

మున్సిపల్‌ ఎన్నికలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్‌ : తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. కొత్త మున్సిపల్‌ చట్టాన్ని తమకు సమర్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. వార్డుల విభజన ఏవిధంగా చేపట్టారో వివరించాలని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ గడువును ఎందుకు తగ్గించారో చెప్పాలని అడిగింది. 

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి చట్టప్రకారమే వ్యవహరించామని, వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ నిబంధనల ప్రకారమే జరిగిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే రాజకీయ కోణంలోనే ఈ ప్రక్రియ చేపట్టారని, ముఖ్యంగా వార్డుల విభజన గందరగోళంగా జరిగిందని పిటిషన్‌ తరఫు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం వార్డుల విభజన ఏ ప్రాతిపదికన చేశారో తెలపాలని పేర్కొంది. కొత్త చట్టానికి, పాత చట్టానికి మధ్య తేడా ఏంటీ.. కొత్త చట్టంలో ఏముందో  తెలుసుకోవడానికి తమకు ఆ కొత్త చట్టాన్ని పూర్తి వివరాలతో సమర్పించాలని ఆదేశించింది. ఎల్లుండి మరోసారి దీనిపై విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.


మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

కేసీఆర్‌కు రసాయనాల సీసా పార్శిల్‌ [07:13]

అది సికింద్రాబాద్‌ ప్రధాన తపాలా కార్యాలయం.. అక్కడ ఒకే తరహా పెట్టెలు అరవైకి పైగా ఉన్నాయి. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాటిపై బట్వాడా చేయాల్సిన చిరునామాలను చూసి సిబ్బంది నిర్ఘాంతపోయారు.

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:01]

‘వేదిక ఏదైనా సరే..పాక్‌ను ఎదుర్కొంటాం’ [08:50]

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపైన ఎండగట్టడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ..................

పందెంలో పావురాలు! [08:43]

కోళ్ల పందేలు.. ఎద్దుల పోటీలు చాలా చూశాం. మరి పావురాల పోటీ పెడితే ఎలా ఉంటుంది? చెన్నైలో అదే చేశారు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

గంజాయి అమ్మిన చేతులతో ఉప్పు వ్యాపారం [08:22]

గంజాయి వ్యాపారిలో పరివర్తన తీసుకొచ్చి కొత్త జీవితం ప్రారంభించడానికి తోడ్పాటు అందించారు మదురై పోలీసులు.....