టాటా సన్స్‌ చంద్రశేఖరన్‌ వేతనం ఎంతో తెలుసా?

ముంబయి: టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ 2019 ఆర్థిక సంవత్సరానికి భారీ పారితోషికం అందుకోనున్నారు. ఆయనతో పాటు కంపెనీలోని పలువురి ప్రముఖుల వేతనాల్లో భారీ పెరుగుదల కనిపించింది. 2018లో చంద్రశేఖరన్‌ రూ.55.11కోట్లు అందుకోగా..ఈ ఏడాది రూ.65.52కోట్లు పారితోషికంగా అందుకోనున్నారు. అంటే దాదాపు 19శాతం వృద్ధి చెందింది. ఇందులో రూ.54కోట్లు ఆయన కమిషన్‌గా అందుకుంటారు. అదే 2018లో రూ.47కోట్ల కమిషన్‌ పుచ్చుకున్నారు. 

అదే తరహాలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సౌరభ్‌ అగర్వాల్‌ వేతనం సైతం 22శాతం పెరిగింది. 2019 ఆర్థిక సంవత్సరానికి ఆయన రూ.16.45కోట్లు అందుకున్నారు. అందులో రూ.12కోట్లు కమిషన్‌. స్వతంత్ర డైరెక్టర్లలో వేణు శ్రీనివాసన్‌ కమిషన్‌ తీసుకోవడానికి నిరాకరించగా.. అజయ్‌ పిరమాల్‌ రూ.1.9కోట్ల కమిషన్‌ స్వీకరించారు. రోనేంద్ర సేన్‌ రూ.2కోట్లు, హరీష్‌ మన్వాణీ రూ.1.85కోట్లు, ఫరీదా 1.9కోట్లు కమిషన్‌గా అందుకోనున్నారు. ఈ పారితోషికాలను ఆగస్టులో ముంబయిలో జరగనున్న టాటా సన్స్‌ 101వ వార్షిక సమావేశంలో అందజేయనున్నారు. 

మరిన్ని

Airtel: ఔట్‌గోయింగ్‌ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత [01:22]

ఇతర నెట్‌వర్కులకు చేసే కాల్స్‌ విషయంలో తన అన్‌లిమిటెడ్‌ ప్లాన్లలో ఉన్న పరిమితిని ఎత్తివేస్తూ టెలికాం ఆపరేటర్‌ భారతీ ఎయిర్‌టెల్‌ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 3 నుంచి......

ఉత్పత్తి పెంచిన మారుతీ సుజుకీ [16:02]

ప్రముఖ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) వాహనాల ఉత్పత్తిని పెంచింది. నవంబర్‌లో 4.33 శాతం మేర అదనంగా...

పీఎంవోలో అధికారాలు కేంద్రీకృతం [18:08]

దేశం ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తు్న్న విధానాలపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే....

 మా ప్లాన్లే చౌక: జియో [17:12]

ఇతర నెట్‌వర్క్‌కు చేసే కాల్స్‌ విషయంలో విధించిన పరిమితి.. సాధారణ వినియోగదారుడి అవసరాల కంటే 5 రెట్లు ఎక్కువగానే తాము అందిస్తున్నామని ప్రముఖ టెలికాం సంస్థ జియో తెలిపింది. కాబట్టి వినియోగదారుడు....

నాటి చేతక్‌.. నేటి పల్సర్‌.. ఈయన కృషే..! [14:01]

స్వదేశీ అంటే ఏమిటో లోకానికి చాటి చెప్పినవాడు.. విదేశీ విసిరిన సవాల్‌కు జవాబు చెబుతున్నవాడు.. ఈక్రమంలో ప్రభుత్వాలతో సైతం ఎదురొడ్డినవాడు.. ప్రత్యక్ష రాజకీయాలతో పెద్దగా సంబంధం లేకపోయినా.. సమకాలీన పరిస్థితులపై ప్రభుత్వాన్ని ప్రశించడానికి ఏమాత్రం వెనకాడని వాడు.. సాధారణ జనాల్లో ‘హమారా బజాజ్‌’గా ప్రసిద్ధి చెందిన వాడు..

ఎయిర్‌టెల్‌ మొబైల్‌యాప్‌లో భద్రతా లోపం [01:22]

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌కు చెందిన మొబైల్‌ యాప్‌లో తీవ్రమైన భద్రతా లోపం తలెత్తింది. అయితే సరైన సమయంలో దాన్ని గుర్తించి సరిచేయడంతో పెద్ద సంఖ్యలో యూజర్‌ డేటా లీక్ ముప్పు తప్పినట్టు

ఆదాయపు పన్ను తగ్గిస్తారా? [01:22]

ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఆదాయపు పన్ను హేతుబద్ధీకరణ అంశం కూడా అందులో ఒకటని చెప్పారు. ‘హిందుస్థాన్‌ టైమ్స్‌’ లీడర్‌.....

వాట్సప్‌లో కాల్‌ వెయిటింగ్‌ ఫీచర్‌ [01:22]

వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్‌ వచ్చింది. ఇప్పటి వరకు వాట్సప్‌ కాల్‌లో మనం ఎవరితోనైనా సంభాషిస్తున్నప్పుడు ఇతరులెవరైనా వాట్సప్‌ కాల్‌ చేస్తే అవతలి కాల్‌ ఆటోమేటిక్‌గా కట్‌ అయిపోయేది.