శ్రీసిటీ చోరీకేసు ఛేదించిన పోలీసులు

శ్రీసిటీ: ఆరు నెలల క్రితం శ్రీసిటీలో జరిగిన సెల్‌ఫోన్‌ లోడ్‌ వాహనం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఈ ఘటన జరిగింది. దగదర్తి జాతీయ రహదారి వద్ద రూ. 4.18కోట్ల విలువజేసే సెల్‌ఫోన్ల వాహనాన్ని దుండగులు అపహరించారు. ఆరు నెలల పాటు కేసు కేసును విచారించిన పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 70లక్షల విలువచేసే చోరీ నగదు, లారీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్ చెందినవారుగా పోలీసులు గుర్తించారు. నిందితులపై తమిళనాడు, చిత్తూరులోనూ పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. చోరీ చేసిన ఫోన్లను మహారాష్ట్ర నుంచి బంగ్లాదేశ్‌కు తరలించినట్లు వెల్లడించారు. 

బిహార్‌కు చెందిన మహ్మద్‌ ఇంతియాజ్‌ అనే లారీ డ్రైవర్‌ తన కంటెయినర్‌ యజమాని సూచన మేరకు ఫిబ్రవరి 12న సాయంత్రం చిత్తూరు జిల్లా శ్రీసిటీలోని ఓ మొబైల్‌ తయారీ సంస్థ నుంచి రూ. 4.8కోట్ల విలువైన 4,340 సెల్‌ఫోన్ల లోడును తీసుకుని కోల్‌కతా బయల్దేరారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్‌గేట్‌ దాటి కొంత దూరం ప్రయాణించిన తరువాత రాత్రి 9 గంటల సమయంలో కంటైనర్‌కు ముందు, ఇరు వైపులా మూడు లారీలు వచ్చి ఆగాయి. ఎటూ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇంతియాజ్‌ కంటైనర్‌ను ఆపేశారు. ఆ మూడు లారీల నుంచి నలుగురు వ్యక్తులు కంటెయినర్‌లోకి బలవంతంగా ప్రవేశించి, ఇంతియాజ్‌ కళ్లకు గంతలు కట్టి, చేతుల్ని కట్టేసి దాడిచేశారు. ఆయన వద్దనున్న రూ.9 వేల నగదు, చరవాణి లాక్కొన్నారు. అనంతరం ఆయన్ను ఓ కారులోకి తరలించి, సుమారు 5 కి.మీ. మేర తీసుకెళ్లి దట్టమైన అటవీప్రాంతంలో వదిలివేశారు. అక్కడి నుంచి బయటపడిన ఇంతియాజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. గౌరవరం వద్ద కంటెయినర్‌ను గుర్తించారు. అయితే అందులో ఫోన్లు లేవు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు ఆరు నెలల పాటు విచారణ చేసి ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేశారు. 

మరిన్ని

పెళ్లి బహుమతిగా ఉల్లి.. [12:50]

ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో  ధరల పెరుగుదలపై ప్రజలు పలురూపాల్లో ....

తిరుపతిలో బాలికపై అత్యాచారం:ఇద్దరి అరెస్ట్‌ [13:36]

దేశంలో మహిళలపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన దిశ ఘటనను మరవక ముందే తిరుపతిలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’ [20:42]

నా చుట్టూ మంటలు అలముకున్నాయి. మహా అయితే రెండు మూడు నిమిషాలు బతుకుతా. నేను చెప్పదలచుకున్నది ఒకటే.. నా కుటుంబాన్ని చక్కగా చూసుకో’’ అంటూ దిల్లీ అగ్నిప్రమాద....

మహేశ్‌-విజయశాంతి ఇది గమనించారా? [20:27]

మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథనాయిక.

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు [20:14]

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం  ప్రశ్నోత్తరాల తర్వాత జరిగే...

మద్యాన్ని ఆదాయవనరుగా భావించం:ఏపీమంత్రి [20:06]

సమాజంలో ఎన్నో అనర్థాలకు మద్యమే కారణమని.. మూడేళ్లలో రాష్ట్రం నుంచి మద్యాన్ని వెలివేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో

బాలయ్య సరసన రష్మి [19:54]

మాస్‌లో నందమూరి బాలకృష్ణకు ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రాలు ‘సింహా’, ‘లెజెండ్‌’. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాలు నటుడిగా ...

బిగ్‌బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌ [19:41]

ఉమెన్స్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌ హీట్‌ ఉమెన్‌ జట్టు నిలిచింది. వరుసగా రెండు సీజన్లో టైటిల్‌ సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ ఉమెన్‌ జట్టుపై బ్రిస్బేన్‌ హీట్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం

చట్టాల సవరణలకు సంకల్పించాం: అమిత్‌షా [19:29]

హత్యాచారం వంటి తీవ్ర నేరాల్లో న్యాయం ఆలస్యం అవుతుండడంతో ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలను సవరించాలని ప్రభుత్వం సంకల్పించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు.

కరణ్‌ డైరెక్షన్‌లో ఆ జోనర్‌లో నటించాలని ఉంది [19:16]

ఈ ఏడాది విడుదలైన ‘కబీర్‌ సింగ్‌’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు నటి కియారా ఆడ్వాణీ. ప్రస్తుతం ఆమె కరణ్‌ జోహార్‌ నిర్మాతగా...