పొడవా.. టి గౌను

ఒడిశా: తాను దర్జీ వృత్తిలోకి వచ్చి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంబల్‌పుర్‌కు చెందిన అనంత మెహర్‌ అనే టైలర్‌ ఏకంగా 32 అడుగుల పొడవైన గౌను కుట్టారు. కేవలం 7 రోజుల్లోనే దీన్ని పూర్తిచేసి అందరినీ అబ్బుర పరిచారు. వృత్తిని ఎంతగానే ప్రేమించే ఆయన దీన్ని బయట ప్రదర్శనకు ఉంచారు. ఇందుకుగాను 125 మీటర్ల సంబల్‌పురీ వస్త్రాన్ని వినియోగించారు. దాదాపు రూ. 50,000 ఖర్చు చేసినట్లు మెహర్‌ తెలిపారు. సంబల్‌పురీ చేనేతలకు ప్రపంచస్థాయి గుర్తింపు రావాలన్న ఉద్దేశంతో దీన్ని తయారు చేసినట్లు చెప్పారు.


మరిన్ని