సైనికులకు రెక్కలు

ఆకాశంలో గద్దలా దూసుకొచ్చే ఒక సైనికుడు సర్రున నేలపై దిగి, శత్రువుల పీచమణచి, తిరిగి వినీలాకాశంలోకి వెళ్లిపోయి అదృశ్యమవుతాడు. ఇదేదో హాలీవుడ్‌ సైన్స్‌ కాల్పనిక సినిమా దృశ్యమనుకుంటున్నారా? త్వరలోనే ఈ కొత్తరకం సైనికులు రాబోతున్నారు.

జెట్‌ శక్తితో నడిచే హోవర్‌బోర్డ్‌ సాయంతో ఫ్రాంకీ జపాటా అనే సాహసి గాల్లో విహరిస్తూ తొలిసారిగా ఇంగ్లిష్‌ ఛానల్‌ను దాటడం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. ఈ సాధనాన్ని ఎలాంటి అవసరాలకు ఉపయోగించాలన్న చర్చ మొదలైంది. దీన్ని సైనిక చర్యకు వాడాలని అమెరికా, ఫ్రాన్స్‌ యోచిస్తున్నాయి. ఈ మేరకు హోవర్‌బోర్డ్‌ను ఆ కోణంలో పరీక్షిస్తున్నాయి.

మరిన్ని