కొత్తగా ఆరు విమానాశ్రయాలు! 

రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం 
సాధ్యాసాధ్యాలపై ఏఏఐకి అధ్యయన బాధ్యతలు 
సెప్టెంబరుకు నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. పెరుగుతున్న ప్రయాణ అవసరాల దృష్ట్యా ఆదిలాబాద్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, కొత్తగూడెంలలో విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ పథకం ఉడాన్‌ కింద వీటిని నిర్మించాలని యోచిస్తోంది. పెద్దపల్లి, వరంగల్‌, ఆదిలాబాద్‌లలో ఇప్పటికే ఎయిర్‌ స్ట్రిప్‌లు ఉన్నాయి. వరంగల్‌ ఎయిర్‌ స్ట్రిప్‌ను సైనిక అవసరాలకు నిర్మించారు. పెద్దపల్లి, ఆదిలాబాద్‌లలో బిర్లా సంస్థ తమ పరిశ్రమల అవసరాల కోసం నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రతిపాదించిన 6 ప్రాంతాల్లో అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)ని కన్సల్టెన్సీగా నియమించింది. ఏఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సాధ్యాసాధ్యాలపై సెప్టెంబరు చివరికి నివేదిక అందజేయనున్నారు. దాని ఆధారంగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ విధానాన్ని రూపొందిస్తాయి.

ఈ నెల 19 నుంచి 3 రోజుల పర్యటన 
అధ్యయనంలో భాగంగా గత నెలలో అధికారుల బృందం వరంగల్‌, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌లలో ప్రతిపాదించిన ప్రాంతాలను పరిశీలించింది. రెండో దశలో ఈ నెల 19 నుంచి 3 రోజులపాటు ఆదిలాబాద్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌లలో పర్యటించనుంది.

ఈ అంశాలపై పరిశీలన 
ప్రతిపాదించిన ప్రాంతాల్లో విమానాశ్రయాల అవసరం ఉందా? 
ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ డిమాండ్‌ ఏ స్థాయిలో ఉంటుంది? 
ఇప్పటికే ఎయిర్‌ స్ట్రిప్‌లు ఉన్న ప్రాంతాల్లో స్థలం ఎంత ఉంది? అది సరిపోతుందా? 
పూర్తిస్థాయిలో నిర్మించాల్సిన ప్రాంతాల్లో ఎంత స్థలం అవసరం? 
ఆయా ప్రాంతాల్లో గడిచిన 5-6 దశాబ్దాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలమా? కాదా?


మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

కేసీఆర్‌కు రసాయనాల సీసా పార్శిల్‌ [07:13]

అది సికింద్రాబాద్‌ ప్రధాన తపాలా కార్యాలయం.. అక్కడ ఒకే తరహా పెట్టెలు అరవైకి పైగా ఉన్నాయి. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాటిపై బట్వాడా చేయాల్సిన చిరునామాలను చూసి సిబ్బంది నిర్ఘాంతపోయారు.

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:01]

‘వేదిక ఏదైనా సరే..పాక్‌ను ఎదుర్కొంటాం’ [08:50]

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపైన ఎండగట్టడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ..................

పందెంలో పావురాలు! [08:43]

కోళ్ల పందేలు.. ఎద్దుల పోటీలు చాలా చూశాం. మరి పావురాల పోటీ పెడితే ఎలా ఉంటుంది? చెన్నైలో అదే చేశారు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

గంజాయి అమ్మిన చేతులతో ఉప్పు వ్యాపారం [08:22]

గంజాయి వ్యాపారిలో పరివర్తన తీసుకొచ్చి కొత్త జీవితం ప్రారంభించడానికి తోడ్పాటు అందించారు మదురై పోలీసులు.....