అమ్మను తలుస్తూ.. దేవుడిని స్మరిస్తూ

తిరుమల, న్యూస్‌టుడే: దివంగత సినీనటి శ్రీదేవి తనయ జాన్వి కపూర్‌ మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు. వేకువజామున సుప్రభాతసేవలో, ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీదేవి 56వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన జాన్వి.. తన తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయ మహద్వారం వద్ద స్నేహితురాలితో కలిసి సాష్టాంగ నమస్కారం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘హ్యాపీ బర్త్‌డే అమ్మా, ఐ లవ్‌ యూ’’ అంటూ తల్లి ఫొటోతోపాటు తిరుమలలో తీసుకున్న ఫొటోను జత చేశారు.

మరిన్ని