కరవుతో అల్లాడుతున్న సీమను ఆదుకోండి: సీపీఎం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కరవుతో అల్లాడుతున్న రాయలసీమకు మంచినీరు, పశుగ్రాసం, ఉపాధి, పంటల పరిహారం అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కోరారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పోడు పట్టాలిచ్చి ఆదివాసీలను ఆదుకోవాలని కోరారు. వివిధ శాఖల్లో పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగులను అక్రమంగా తొలగిస్తున్నారని, దిగువ స్థాయిలో రాజకీయ కారణాలతో తొలగించడం తగదన్నారు.

మరిన్ని