హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వాలు: రామకృష్ణ

విజయవాడ, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా హక్కుల్ని కాల రాస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. మంగళవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏనాడూ మాట్లాడలేదన్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, సమస్యల పరిష్కారం ఆయనకు పట్టడంలేదన్నారు. రాజ్యసభలో భాజపాకు సంఖ్యా బలం లేకున్నా.. మిత్ర పార్టీలు, ప్రతిపక్ష సభ్యుల్లో కొందర్ని ఒప్పించి కశ్మీర్‌ను విడగొట్టడంలో వెంకయ్యనాయుడు కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆంధ్రాపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారని అన్నారు.

మరిన్ని