తెదేపా నాయకులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయండి

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

సోమశిల, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ పాలనలో కృష్ణా, గోదావరి నదులకు వరదలు వచ్చి జలాశయాలు నిండుతుండటంతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ విమర్శించారు. సోమశిల ప్రాజెక్టు నుంచి కండలేరుకు నీటి విడుదల చేసిన అనంతరం మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పల్నాడులో బాధితుల కోసం ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రాలను తెదేపా నాయకులకు కేటాయించాలని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు, ఇతర పార్టీల వైపు వెళ్లకుండా ఇటువంటి కేంద్రాలు పెట్టి వారిని కాపాడుకోవాలని చంద్రబాబుకు సూచించారు. పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబరు 26 నాటికి కడప ఉక్కు కర్మాగారం నిర్మాణాలకు పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రిలయన్స్‌ గ్యాస్‌ ద్వారా జిల్లాకు ప్రత్యేక రాయితీతో గ్యాస్‌ ఆధారిత పరిశ్రమలు స్థాపన లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

మరిన్ని