పోకిరీలతో గుంజీలు తీయించిన యువతి

ఒడిశా: తనను అభ్యంతరకర మాటలు అన్నందుకు ఓ యువతి ఇద్దరు పోకిరీలకు నడిరోడ్డుపైనే బుద్ధి చెప్పింది. ఆకతాయిలను రెండుసార్లు చెంపదెబ్బలు కొట్టింది. అనంతరం గుంజీలు తీయించింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన ఈ ఘటన దృశ్యాలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. జగన్నాథ్‌ ప్రాంతంలోని బొమిఖల్‌లో బెబినా మహాలఖి అనే యువతి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా... ఇద్దరు ఆకతాయిలు వెంటపడ్డారు. ఆమెను చూసి అభ్యంతరకరంగా మాట్లాడారు. బెబినా వెంటనే వారి ద్విచక్ర వాహనాన్ని ఆపి.. ఇద్దరి చెంపలు వాయించింది. నడిరోడ్డుపై గుంజీలు తీయించింది. అనంతరం పోలీసులు ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. బెబినా ధైర్యానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని