మూడు వైద్యకళాశాలలకు ప్రతిపాదనలు

  ఖమ్మం, కరీంనగర్‌, మంచిర్యాలల్లో ఏర్పాటుకు కృషి
  వైద్యులకు నెల రోజులు సెలవులు రద్దు: మంత్రి ఈటల

ఖమ్మం వైద్యవిభాగం, సూర్యాపేట(తాళ్లగడ్డ), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఖమ్మం, కరీంనగర్‌, మంచిర్యాలల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నివేదించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ఖమ్మం, సూర్యాపేటల్లోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆయన మంగళవారం సందర్శించారు. తీవ్ర జ్వరాలతో బాధపడుతున్న రోగుల ఇబ్బందులను  పరిశీలించారు. ఖమ్మం ఆసుపత్రిలో ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్వరాల ముందస్తు నివారణ ఔషధ పంపిణీ కార్యక్రమాన్ని పారంభించారు. ఒక్కో మంచంపై ఇద్దరు ఉన్న విషయంపై అధికారులతో చర్చించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని ఆదేశించారు. విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో నెల రోజులపాటు వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జ్వరాలతో ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.

మరిన్ని