శ్రీశైలం క్రస్టుగేట్ల పైనుంచి వరద నీరు

గేట్లను పైకెత్తడంతో తప్పిన  ప్రమాదం

ఈనాడు డిజిటల్‌, కర్నూలు: శ్రీశైలం ఆనకట్ట క్రస్టుగేట్ల పైనుంచి వరదనీరు పారింది. మంగళవారానికి 3.38 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుండటంతో జలాశయం ఒక్కో గేటును 17 అడుగుల మేర ఎత్తి 6 గేట్ల ద్వారా నీటిని కిందకు వదిలారు. ఎత్తు పూర్తిస్థాయిలో పెంచకపోవడంతో ఆనకట్ట 1, 2, 3, 10, 11, 12 గేట్ల పైనుంచి వరదనీరు పారింది. దాదాపు గంటసేపు ఇలా రావడంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు దీన్ని గుర్తించి.. గేట్ల ఎత్తును పెంచి స్పిల్‌వే ద్వారా 3.20 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేశారు. కొంతసేపటికి గేట్ల పైనుంచి నీరుపారడం ఆగిపోయింది. 2009 భారీ వరదల తర్వాత క్రస్టుగేట్ల పైనుంచి వరదనీరు పారడం ఇదే తొలిసారి.

మరిన్ని