డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదా... జాగ్రత్త..

వాహనం నడిపితే ఇక కష్టాలే..
కొత్త జరిమానా రూ.5వేలు.. కోర్టుకూ హజరు
ఈనాడు, హైదరాబాద్‌

ల్లిదండ్రులు.. బంధువుల బైక్‌లుంటే చాలు... రద్దీ రహదారులపై విన్యాసాలు చేస్తుంటారు.. తండ్రి కారు తీసుకుని రాత్రి వేళల్లో వంద కిలోమీటర్లకుపైగా వేగంతో వెళుతుంటారు. వాహన చోదక పత్రం లేకున్నా కొందరు యువకులు, యువతులు చేస్తున్న పనులివి.. వాటిని ఇకపై అలాగే కొనసాగిస్తే వారికి కష్టాలే... మోటార్‌ వాహన సవరణ చట్టం ప్రకారం వారిపై ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేస్తారు. కోర్టులో అభియోగ పత్రాలు సమర్పిస్తారు. కోర్టుకు హాజరై రూ.5వేల జరిమానా చెల్లించిన తర్వాతే వాహనం చేతికి వస్తుంది.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడుపుతున్న యువకులు, మైనర్ల వల్లే ప్రమాదాలు జరుతున్న నేపథ్యంలో పోలీసులు వాహన చోదక అనుమతి పత్రాలపై దృష్టి కేంద్రీకరించారు. ఉత్సాహంగా వెళ్తూ.. మద్యం మత్తులో వాహనాలు నడపడం వంటి ఘటనల్లో మైనర్లు పట్టుబడుతుండడంతో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ఠాణాల పరిధుల్లో పాయింట్లతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసులు గత నెల ఆకస్మికంగా నిర్వహించిన తనిఖీల్లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా పట్టుబడిన వారే ఎక్కువ మంది ఉన్నారని తేలింది. దీంతో వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా ప్రమాదాలు చేస్తే ఐపీసీ 279 సెక్షన్‌ ప్రకారం జైలుకు పంపుతున్నారు. తల్లిదండ్రులనూ బాధ్యుల్ని చేస్తున్నారు.

చోదక పత్రం లేకుంటే...
యువకులు, మైనర్లలో 50శాతం మంది చోదక పత్రాలు లేకుంగా వాహనాలు నడుతుపుతున్నారని తెలుసుకున్నారు. లైసెన్స్‌ లేకుండా వాహనాలను నడుపుతున్న వారిని గుర్తించి వారిపై ముమ్మరంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ నెలాఖరు వరకూ ఏడు వేలకుపైగా కేసులను నమోదు చేశారు. వాహనాలు ఇచ్చిన యజమానిపైనా వాటంతట అవే కేసులు నమోదయ్యేలా పీడీఏ (వ్యక్తిగత డిజిటల్‌ సహాయకారి)లను ట్రాఫిక్‌ పోలీస్‌ కానిస్టేబుళ్లకు ఇచ్చారు. కూడళ్ల వద్ద సీసీ కెమెరాల్లో మైనర్లు నడుపుతున్న దృశ్యాలు కనిపిస్తుండడంతో ట్రాఫిక్‌ పోలీసులు చలానా యంత్రాలతో సహా పలుప్రాంతాల్లో సిద్ధం ఉన్నారు. గతనెలో 15 రోజుల వ్యవధిలో 900 మందిని పట్టుకుని కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

జోష్‌తో యువకులు... మైనర్లు...
ద్విచక్ర వాహనం, కార్లు, స్పోర్ట్స్‌ బైకులు.. యువకులుకు ఇష్టమైన వాహనాలు. గల్లీలైనా.. రహదారులైనా... గంటకు వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్తున్నారు. రద్దీ ప్రాంతాలు,  వాహనాలు కిక్కిరిసి ఉన్న ఖైరతాబాద్‌, పంజాగుట్ట, ఆబిడ్స్‌, కోఠీల్లోనూ వేగం తగ్గించడం లేదు. పీపుల్స్‌ ప్లాజా, నెక్లెస్‌ రోడ్‌, జూబ్లీహిల్స్‌, నార్సింగి, బాహ్యవలయ రహదారులు యువకులు, మైనర్లకు నచ్చిన ప్రాంతాలు.. ఇక్కడ కొందరు విద్యార్థులు, మైనర్లు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బైకుల్ని నడుపుతున్నారు. నియంత్రణ కోల్పోతే ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా బైక్‌ రేసింగ్‌లు చేస్తున్నారు. ఇటీవల పోలీసులు రహదారులపై ప్రమాదాలు, వాహన చోదకుల వివరాలను విశ్లేషించగా... 40శాతం మంది మైనర్లు ద్విచక్ర వాహనాలను నడుపుతుండగా... 20శాతం మంది కార్లపై దూసుకెళ్తున్నారు.  డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వారిలో 30శాతం మంది వారి తల్లిదండ్రులు, ఇతరుల వాహనాలను దర్జాగా రోడ్లపైకి తీసుకువస్తున్నారు.

తల్లిదండ్రులకూ బాధ్యత
లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని, ఇతరుల వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకుని అక్కడిక్కడే వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. మైనర్లు అయితే తల్లిదండ్రులను పిలిపించి వారితో మరోసారి వాహనాలను నడపనీయమంటూ లిఖితపూర్వకంగా రాయించుకుంటున్నారు. లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నామంటూ దరఖాస్తు నంబరు చూపించాకే యజమానులకు వాటిని అందజేస్తున్నారు. లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే కొత్తగా రూ.5వేల జరిమానా కట్టాల్సి వస్తుందంటూ ట్రాఫిక్‌ పోలీసులు మూడు రోజుల నుంచి అవగాహన కల్పిస్తున్నారు.

మరిన్ని

13 అంతస్తుల భవనంపైకి ఎక్కి రైతుల నిరసన [13:36]

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌ భవనంపైకి ఇద్దరు రైతులు ఎక్కడం ఆందోళన కలిగిస్తోంది. తుళ్లూరు, నెక్కల్లు గ్రామాలకు చెందిన కొందరు రైతులు నూతనంగా నిర్మిస్తున్న ఎమ్మె్ల్యే క్వార్టర్స్‌ వద్ద

‘డమ్మీ కాన్వాయ్‌తో ట్రయల్‌ రన్‌..సిగ్గుచేటు’ [19:32]

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పెరిగే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ ఒప్పందం చేసుకున్నారని.. అందుకే అమరావతిని చంపేస్తున్నారని...

‘దిల్లీలో కొట్లాట..గల్లీలో షేక్‌హ్యాండ్‌’ [20:54]

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను కోరారు. మున్సిపల్‌ ఎన్నికల...

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం [23:44]

గుజరాత్‌ రాష్ట్రంలోని సురేంద్రనగర్‌ జిల్లా ఘోర దేవ్‌పరా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలవగా, మరో ఐదుగురు గాయపడ్డారు. వీరంతా గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది

అణిచివేత చర్యలు అప్రజాస్వామికం: చంద్రబాబు [23:38]

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెదేపా నేతల గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తమ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రజలు ఉన్నారని, ప్రభుత్వానికి తమ ఆకాంక్షలను తెలియజేయాలనుకున్న తరుణంలో ఈ విధమైన అణిచివేత చర్యలు...

మోదీ ట్వీట్‌ను కాపీ కొట్టిన బ్యూటీ [23:32]

చాలామంది ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తుంటారు. వారి స్పందన...

తెదేపా నేతల గృహనిర్బంధం [23:24]

అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. 13 జిల్లాల్లో తెదేపా నాయకులు, ఐకాస నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఇప్పటికే ప్రతిపక్ష తెదేపా నేతలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో

రాజధాని కోసం ఆగిన మరో గుండె [23:19]

రాజధాని తరలింపు ప్రకటనల నేపథ్యంలో మరో మహిళా రైతు గుండె ఆగింది. అమరావతి రాజధానిని తరలించవద్దని చేపట్టిన దీక్షా శిబిరంలో...

దీపికపై అభిమానుల ఫైర్‌ [23:02]

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ జేఎన్‌యూ సందర్శనపై రాజకీయ నాయకుల నుంచి...

ఫేస్‌బుక్‌ పోస్టు.. సినిమాలాంటి ట్విస్టు [22:52]

మంచి చేసేవాళ్లకు ఎప్పటికైనా మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ వార్త చదివితే ఎవరికైనా అది  నిజమనిపించక మానదు.