ఏదో ఒకరోజు శివసైనికుడు సీఎం అవుతారు!

ఇది నాన్నకిచ్చిన మాట..

ఏదో ఒక రోజు శివసైనికుడు ఒకరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు. ఇది శివసేన వ్యవస్థాపకులు, మా నాన్న దివంగత బాలాసాహెబ్‌కు నేను ఇచ్చిన మాట. నా కుమారుడు ఆదిత్య ఠాక్రే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడంటే దానర్థం నేను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకొన్నట్లు కాదు. నేను కీలకంగానే ఉంటా.. వ్యవసాయం చేసుకోవడానికేమీ వెళ్లిపోవడం లేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, శివసేన వేర్వేరుగా పోటీ చేయడం వెనుక కారణాలేమిటనే అంశంపై ఇప్పుడు చర్చ అనవసరం. అదో యుద్ధం. అప్పట్లో జాతీయస్థాయిలో ఓ ‘వేవ్‌’ (మోదీ ప్రభంజనం అనే అర్థంలో) ఉంది. కానీ దానికి మహారాష్ట్రలో మేం ‘చెక్‌’ పెట్టాం. పదవిలో ఉన్నామా? లేదా? అన్నదానితో సంబంధం లేకుండా సామాన్య ప్రజానీకం కోసం మేం నిరంతరం గళం వినిపిస్తూనే ఉన్నాం. తాజా ఎన్నికల్లో మహారాష్ట్ర కోసమే భాజపాతో పొత్తుకు రాజీ పడ్డాం. సీట్ల సర్దుబాటులో మేము ఆ పార్టీ కంటే తక్కువ స్థానాల్లోనే పోటీ చేస్తున్నాం. తమ సమస్యను అర్థం చేసుకోవాలని దేవేంద్ర ఫడణవీస్‌ (ముఖ్యమంత్రి), చంద్రకాంత్‌ పాటిల్‌ (భాజపా రాష్ట్ర అధ్యక్షుడు) నన్ను కోరడంతో దీనికి అంగీకరించాం.

- ఉద్ధవ్‌ ఠాక్రే, శివసేన అధిపతి(పార్టీ పత్రిక సామ్నా ముఖాముఖిలో)

మరిన్ని