సిద్ధిధాత్రిగా సరస్వతి

నిర్మల్‌ జిల్లా బాసర సరస్వతీ ఆలయంలో తొమ్మిది రోజుల పాటు వైభవంగా సాగిన దసరా ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. తొమ్మిదో రోజైన సోమవారం మహర్నవమిని పురస్కరించుకొని అమ్మవారు సిద్ధిధాత్రిగా భక్తులకు దర్శనమిచ్చారు.  మహా అభిషేకం, నవచండీహవన పూర్ణాహుతి నిర్వహించారు. మంగళవారం విజయదశమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారిని బాసర పురవీధుల్లో అశ్వరథంపై ఊరేగిస్తారు. శమీపూజ నిర్వహించి రాత్రి హారతి అనంతరం నెమలి పల్లకిలో అమ్మవారికి ఊరేగింపు సేవ నిర్వహిస్తారు.

- న్యూస్‌టుడే, బాసర

మరిన్ని