ఇక అభిరుచికి తగ్గ సంగీతం!

సందర్భం, భావోద్వేగాలకు అనుగుణంగా వినిపించే అల్గారిథం ఆవిష్కరణ

హ్యూస్టన్‌: గాయపడిన మనసును సంగీతం స్వస్థపరుస్తుంది. నిద్రపుచ్చుతుంది. ఉర్రూతలూగిస్తుంది. స్ఫూర్తినిస్తుంది కూడా. కానీ... ఇక్కడో చిక్కుంది. ఒకరికి ఇష్టమైన సంగీతం మరొకరికి చిరాకు తెప్పిస్తుంది. ఒకే వ్యక్తి అన్ని సందర్భాల్లోనూ ఒకే రకం సంగీతాన్ని ఆస్వాదించలేడు. దీన్ని గమనించిన టెక్సాస్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు... వ్యక్తి అభిరుచి, సందర్భం, భావోద్వేగాలకు తగ్గట్టు సంగీతాన్ని వినిపించేలా సరికొత్త అల్గారిథం రూపొందించారు. దీని పేరు ‘మోంటే కార్లో (డీజే-ఎంసీ)’ అల్గారిథం. శ్రోతల ఆదేశాలు, పాటలకు వారిచ్చే రేటింగ్‌తో పాటు... వారు ఎలాంటి సమాచారాన్ని ఇష్టపడతారు, ఎలాంటి వార్తలను చదువుతారన్నది కూడా ఇది విశ్లేషిస్తుందట. అలా మనిషికి తగ్గటు ఈ అల్గారిథం పాటల జాబితాను రూపొందించి, వినిపిస్తుందని కంప్యూటర్‌ సైన్స్‌ పరిశోధక విద్యార్థి ఎలాడ్‌ లిబ్‌మాన్‌ వివరించారు.

మరిన్ని