మాత్రలు వేసుకుంటున్నారా?

అయితే నీళ్లు ఎక్కువ తాగండి

టొరంటో: అధిక రక్తపోటు, హృద్రోగం, నొప్పులకు మందులు వాడుతున్నారా? అయితే మంచి నీటిని ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు... కెనడాకు చెందిన వాటర్‌లూ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. వివిధ రుగ్మతలకు రోజూ మందులు వేసుకునేవారు తగినంత నీరు తాగకపోతే ఏమవుతుంది? క్షీరదాల మూత్రం అత్యంత గాఢంగా ఎందుకుంటుంది? అన్న విషయాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ‘కంప్యూటర్‌ కిడ్నీ’ని రూపొందించి, పరీక్షించారు. ఔషధాల కారణంగా మూత్ర పిండాలకు హాని కలిగే ప్రమాదముందని, నీటిని అధికంగా తాగడం వల్ల ఈ ప్రమాదం కొంత మేర తగ్గుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన అనితా లేటన్‌ తెలిపారు. ‘‘అధిక రక్తపోటు బాధితులకు వాటర్‌ పిల్‌, హార్మోనల్‌ వ్యవస్థను నియంత్రించే ఔషధాలను వైద్యులు సూచిస్తుంటారు. వీటితో పాటు చాలామంది ఆస్ప్రిన్‌ మాత్రనూ తీసుకుంటుంటారు. ఈ మూడింటి కారణంగా మూత్రపిండాలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. దీనికి తోడు శరీరంలో తగిన మోతాదులో నీరు లేకపోతే... ఉన్న నీటితోనే మూత్రం ద్వారా మలినాలను బయటకు పంపేందుకు మూత్రపిండాలు ప్రయత్నిస్తాయి. దీంతో కొత్త సమస్యలు వచ్చి పడతాయి’’ అని ఆమె వివరించారు.

మరిన్ని