యువ బైక్‌.. నయా లుక్‌!

చూడటానికి పొడవుగా, ఎత్తుగా ఉన్న ఈ ద్విచక్రవాహనాన్ని హైదరాబాద్‌ రామంతపూర్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ మహబూబ్‌ అనే డిప్లొమా(మెకానికల్‌) విద్యార్థి తన ముగ్గురు సహచరులతో కలిసి రూపొందించాడు. దీనికి ‘యువ బైక్‌’ అని నామకరణం చేసినట్లు అతను తెలిపాడు. వంద కిలోమీటర్ల వేగం వరకు వెళ్లగలిగే ఈ వాహనం లీటర్‌కు 50 కి.మీ. మైలేజీ ఇస్తుందని..దీనిని రూపొందించడానికి రూ.25 వేల వరకు ఖర్చయినట్లు వెల్లడించాడు. పాత వాహన పరికరాలతో దీనిని తయారు చేసినట్లు చెప్పాడు.

   - ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని