నోట్ల రద్దుతో ప్రతికూల ప్రభావం

ఆన్‌లైన్‌ సర్వేలో 66శాతం మంది అభిప్రాయం

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ మూడేళ్ల క్రితం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని 66శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆర్థిక మందగమనానికి ఇది కూడా కారణమని 33శాతం మంది చెప్పారు. నల్లధనం అరికట్టడం సహా వివిధ లక్ష్యాలతో మోదీ 2016 నవంబర్‌ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం జరిగి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నోట్ల రద్దు ప్రభావంపై లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించింది. 42 శాతం మంది నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించారు. నోట్ల రద్దు వల్ల నగదు వినియోగం తగ్గి డిజిటలైజేషన్‌ పెరిగిందని వీరు అభిప్రాయ పడ్డారు. అలాగే పన్నులు చెల్లించకుండా తప్పించుకునేవారు కూడా  పన్ను చట్రంలోకి వచ్చారని వీరు విశ్లేషించారు.

మరిన్ని