కేసులో పీటముడి!

జటిలంగా మారుతున్న విజయారెడ్డి హత్య కేసు
కీలకంగా మారిన సురేష్‌ వాంగ్మూలం, చరవాణి

ఈనాడు, హైదరాబాద్‌; అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దారు విజయారెడ్డి హత్య కేసు రాచకొండ పోలీసులకు సవాలుగా మారింది. గురువారం నిందితుడు సురేష్‌ కూడా మృతి చెందడంతో ఈ కేసు మరింత జటిలంగా మారింది. ఇప్పుడిక నిందితుడు వాడిన చరవాణీయే కీలకంగా మారింది. కాల్‌డేటా ఆధారంగా మరికొందర్ని ప్రశ్నించాలని నిర్ణయించారు. ఈ నెల నాలుగో తేదీన ఘటన జరగగా కాలిన గాయాలతో ఉస్మానియాలో చేరిన కొద్ది గంటల వరకు సురేష్‌ వైద్యులతో మాట్లాడాడు. మేజిస్ట్రేట్‌.. వాంగ్మూలం రికార్డు చేసుకున్నప్పుడు పోలీసులు అక్కడ లేరు. వాంగ్మూలాన్ని అందజేయాలంటూ రాచకొండ పోలీసులు మేజిస్ట్రేట్‌ను కోరారు. ఆరోజు సాయంత్రం నుంచి సురేష్‌ మెల్లమెల్లగా సెమీ కోమాలోకి వెళ్లిపోయాడు. గట్టిగా పలకరిస్తే ఊ కొట్టడం తప్ప మాట రాలేదు. 65 శాతం గాయాలు కావడంతో ఆరోజు నుంచి అతడికి కళ్లు పూర్తిగా కన్పించడం మానేశాయని డాక్టర్లు తెలిపారు. భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుగు, ఆవేదన చెంది ఈ ఘటనకు పాల్పడినట్లు అతని మాటలను బట్టి అర్థమైందని ఉస్మానియా వైద్యులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. నిందితుడు సురేష్‌ చనిపోయినా కేసు దర్యాప్తు కొనసాగుతుందని రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు.

ఆ కారులోనే పారిపోవాలనుకున్నాడా..?
తహసీల్దారు విజయారెడ్డిపై పెట్రోలు పోసి నిప్పంటించిన తర్వాత నిందితుడు సురేష్‌ పారిపోవాలనుకున్నాడా..? కాలిన గాయాలు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే పోలీసులకు లొంగిపోయాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తహసీల్దారు కార్యాలయం సమీపంలో వైన్స్‌ దుకాణం వద్ద కారులో ఉన్న వ్యక్తులతో మాట్లాడిన తర్వాతే ప్రణాళిక మార్చుకున్నాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాలకు దారితీసిన పరిణామాలివి..
* ఘటన తర్వాత సురేష్‌ ప్రధాన మార్గంపై బట్టలు చింపుకొని నడుచుకుంటూ అప్పటికే వైన్స్‌ దుకాణం ఎదురుగా ఉన్న కారు దగ్గరికెళ్లడం.
* అందులోని వ్యక్తులతో మాట్లాడగానే పరుగు లంకించుకోవడం.
* 65 శాతం గాయాలు కావడంతో తప్పనిసరిగా చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం.
* అప్పటికే ఘటన తీవ్ర కలకలం రేపడంతో పోలీసులు అప్రమత్తం కావడం.
* నేరుగా ఆసుపత్రికెళ్తే లేనిపోని ఇబ్బందులు రావడం ఖాయమని కారులోని వ్యక్తులు సురేష్‌కు చెప్పి ఉండవచ్చు. ఎవరి చేతికి చిక్కకుండా నేరుగా ఠాణాకు వెళ్లాలని సూచించి ఉండవచ్చు.
* సురేష్‌ పరుగు లంకించుకోగానే ఆ కారు అక్కడే ఉందా.. ఎటువైపైనా వెళ్లిందా అంటూ సమీపంలోని సీసీ ఫుటేజీని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
* అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దారు కార్యాలయం.. నిందితుడు సురేష్‌ స్వగ్రామం గౌరెల్లి నుంచి సుమారు 8 కి.మీ.ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి ఆటోలు, బస్సుల్లో వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో కారులోనే పెట్రోలు డబ్బాతో వచ్చిఉంటాడని అనుమానిస్తున్నారు.
* వైన్స్‌ దుకాణం ముందు ఆగి ఉన్న కారు అదేనేమోనని సంశయిస్తున్నారు.

పోలీసులు పరిశీలిస్తున్న అంశాలు
ఇప్పటికే వనస్థలిపురం ఏసీపీ జయరాం  విచారణాధికారిగా రంగంలోకి దిగిన 4 ప్రత్యేక బృందాలు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశాయి.
* ఘటనకు ముందు తహసీల్దారు కార్యాలయం పరిధిలో ఏం జరిగిందంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా భూముల విక్రయాలు, పాస్‌ పుస్తకాల జారీకి సంబంధించి ఏమైనా గొడవలు జరిగాయాని కూపీలాగుతున్నారు.
* తహసీల్దారును నేరుగా కలిసి ఎవరైనా వాగ్వాదానికి దిగారా లేదా ఫలానా పని చేయాలంటూ ఫోన్‌లో ఒత్తిడి తెచ్చారాని పరిశీలిస్తున్నారు.
* సురేష్‌ ఎప్పుడైనా మిమ్మల్ని కలిశారా అంటూ విజయారెడ్డి భర్తను ప్రశ్నించినట్లుగా తెలిసింది.
* నిందితుడి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలు, చరవాణుల కాల్‌ డేటాను చూస్తున్నారు.


మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

గొంతులో మాంసం ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి [06:50]

మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని సంగారెడ్డి జిల్లాలో ఒకరు మృతి చెందారు. కల్హేర్‌ మండలం మార్డి తండాకు చెందిన తారావత్‌ బాబునాయక్‌ (39) అల్లిఖాన్‌పల్లి తండాకు చెందిన లక్ష్మణ్‌నాయక్‌తో కలిసి బుధవారం సాయంత్రం పిట్లం వెళ్లారు.

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........