సీఎం ఇంటి తలుపులకు 73 లక్షలా: బుద్ధా వెంకన్న

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ ఆరు నెలల కిందట గృహప్రవేశం చేసిన తన ఇంటికి తలుపులు, కిటికీల ఏర్పాటుకు రూ.73 లక్షలు నిధులు కేటాయించుకోవడం విడ్డూరమని, దుబారాఖర్చులకు ఇది నిదర్శనమని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. విజయవాడలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఇసుక కొరతతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అమరావతిలో గుత్తేదారులు ఆత్మహత్య చేసుకునేలా ఈ ప్రభుత్వం ప్రేరేపిస్తోంది. అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1,150 కోట్లు చెల్లిస్తామని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. ఇప్పుడు గత తెదేపా హయాంలో కేటాయించిన రూ.363 కోట్లలోనూ కోత విధించి రూ.264 కోట్లే చెల్లిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.

మరిన్ని