అమ్మా నువ్వెప్పుడొస్తావ్‌..!

 తల్లి మృతదేహం చూసి  కన్నీరుమున్నీరైన చిన్నారి
 ఇంట్లోనే దారుణ హత్యకు గురైన వైనం
 మూడు రోజుల తర్వాత వెలుగులోకి..

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే : మూడు రోజుల క్రితం ఆ బాలికను తల్లి చక్కగా తయారు చేసి పాఠశాలకు పంపించింది. చిన్నారి అదే రోజు మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చేసరికి తాళం వేసి ఉంది. పక్కనే ఉన్న తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ ఉంటూనే రెండు మూడుసార్లు తన ఇంటికి వెళ్లి చూసింది. అమ్మ కనిపించలేదు. దీంతో స్నేహితురాలి తల్లిదండ్రులు బాలికను దగ్గరలో ఉండే ఆమె పెద్దమ్మ ఇంటికి తీసుకెళ్లారు. ఆమె కూడా తన సోదరి ఇంటికి తాళం ఉండటంతో ఎక్కడికో వెళ్లి ఉంటుందని భావించింది. మూడురోజులుగా బాలిక తన ఇంటివైపు వస్తూనే ఉంది. కాని అమ్మ మాత్రం ఎంతకీ కనిపించలేదు. గురువారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ఆ ఇంటికి పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టడంతో ఆ ఇంట్లోనే అమ్మ శవమై కనిపించింది. మూడు రోజులుగా తల్లి కోసం ఎదురు చూస్తున్న ఆ చిన్నారి, తల్లి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా విలపించింది. రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సీˆఐ సురేష్‌ తెలిపారు.

కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా చింకోడ్‌ గ్రామానికి చెందిన జీవన్‌రావు, జ్యోతి(35) భార్యాభర్తలు. రెండేళ్ల క్రితం భర్తతో విభేదాల కారణంగా జ్యోతి అతనికి దూరంగా ఉంటుంది. రెండు నెలల క్రితం రాజేంద్రనగర్‌ ఠాణా అత్తాపూర్‌ రాంబాగ్‌లోని ఓ ఇంట్లో అద్దెకు దిగింది. ఆమె ఇద్దరు పిల్లలు దివ్య(15), నవ్య(8)లలో దివ్యను వసతిగృహంలో ఉంచి చదివిస్తోంది.  నవ్యను తన దగ్గరే పెట్టుకొని స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలకు పంపుతోంది. మూడురోజుల క్రితం నవ్యను పాఠశాలకు పంపించింది. నవ్య తిరిగొచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమె తన స్నేహితురాలి ఇంటికి.. అక్కడి నుంచి పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. గురువారం జ్యోతి అద్దెకు ఉండే ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులొచ్చి తాళం పగలగొట్టడంతో జ్యోతి ఇంట్లోనే దారుణ హ్యతకు గురై కనిపించింది. బీదర్‌కు చెందిన ఓ వ్యక్తితో జ్యోతి సన్నిహితంగా ఉంటుందని పోలీసుల విచారణలో తేలింది. అప్పుడప్పుడు వచ్చే ఆ వ్యక్తి ఇక్కడే రెండు, మూడు రోజులు ఉండి వెళ్తుండేవాడని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో మూడురోజుల క్రితం హత్యకు గురైన జ్యోతిని తరచూ ఇంటికి వచ్చే సదరు వ్యక్తి హత్య చేసి ఉంటాడా? లేక అతనితో సన్నిహితంగా ఉంటున్న కారణంగా భర్తే ఇక్కడికి వచ్చి హత్య చేశాడా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. జ్యోతిని తలపై బాది, గొంతునులిమి చంపినట్లుగా అనుమానిస్తున్నారు. హత్య చేసిన అనంతరం బయట నుంచి తాళం వేసి దుండగులు పరారయ్యారు.


మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం [01:04]

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం గురువారం మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీఓకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు.