గురువుగారి విగ్రహావిష్కరణ

జనీకాంత్‌, కమల్‌హాసన్‌లకు సినీ గురువు ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌. ఆయన కారణంగానే ఈ రోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నామని గర్వంగా  చెప్పుకుంటుంటారు ఈ ఇద్దరు అగ్ర కథానాయకులు. కమల్‌ 65వ పుట్టినరోజు సందర్భంగా తన రాజ్‌కమల్‌ నిర్మాణ సంస్థ కార్యాలయాన్ని శుక్రవారం చెన్నైలో ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బాలచందర్‌ విగ్రహాన్ని కమల్‌, రజనీ   కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ మాట్లాడుతూ ‘‘కమల్‌హాసన్‌ రాజకీయాల్లోకి వచ్చినా కానీ, తన పుట్టినిల్లైన సినిమాను ఆయన మర్చిపోరు. కళారంగమంటే ఆయనకు ప్రాణం. కమల్‌ నటించిన ‘అపూర్వ సహోదరర్గల్‌’ (విచిత్ర సోదరులు) చిత్రాన్ని చూసి నేను ఆశ్చర్యపోయా. అర్ధ రాత్రి 2 గంటలకు వెళ్లి కమల్‌ను అభినందించా. ఆయన నిర్మాణంలో వచ్చిన మరో చిత్రం ‘దేవర్‌ మగన్‌’ మహా కావ్యం. ఆయన నటించిన ‘హే రామ్‌’ చిత్రాన్ని 40 సార్లు చూసుంటా. కె.బాలచందర్‌ విగ్రహాన్ని చూస్తున్నప్పుడు ఆయనతోటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ‘నువ్వు తమిళం నేర్చుకో. నిన్ను ఏ స్థాయికి తీసుకెళ్తానో చూడు..’ అన్నారు బాలచందర్‌. ఆయన నాకు మంచి జీవితానిచ్చారు. కమల్‌ అంటే ఆయనకు ఇష్టం. కమల్‌ నటనను దూరం నుంచి చూస్తూ ఆస్వాదించేవారు’’ అని చెప్పారు. కార్యక్రమంలో మణిరత్నం, వైరముత్తు, నాజర్‌, శ్రుతిహాసన్‌ తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, కోడంబాక్కం

మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం [01:04]

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం గురువారం మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీఓకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు.