పారిస్‌ అందాల మధ్య...

ల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తర్వాత అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. పూజాహెగ్డే కథానాయిక. అల్లు    అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతలు. జనవరి 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం పారిస్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అల్లు అర్జున్‌, పూజాహెగ్డేలపై ‘సామజవరగమన...’ పాటని చిత్రీకరిస్తున్నారు. శేఖర్‌ మాస్టర్‌ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘అందమైన ప్రదేశాల్లో ‘సామజవరగమన’ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ పాట శ్రోతలకి ఎంతగానో చేరువైంది. సామాజిక మాధ్యమాల్లో సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, తమన్‌ సంగీతం శ్రోతల్ని ఉర్రూత లూగించాయి. తెరపైన ఈ పాట మరింత అందంగా ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుంద’’న్నాయి చిత్ర వర్గాలు. టబు, రాజేంద్రప్రసాద్‌, సచిన్‌ ఖేడ్‌కర్‌, తనికెళ్ల భరణి, మురళీశర్మ, సముద్రఖని, జయరాం, సునీల్‌, నవదీప్‌, సుశాంత్‌, నివేతా పేతురాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, సంగీతం: తమన్‌, కూర్పు: నవీన్‌నూలి, పోరాటాలు: రామ్‌ - లక్ష్మణ్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పి.డి.వి.ప్రసాద్‌.


మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

గొంతులో మాంసం ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి [06:50]

మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని సంగారెడ్డి జిల్లాలో ఒకరు మృతి చెందారు. కల్హేర్‌ మండలం మార్డి తండాకు చెందిన తారావత్‌ బాబునాయక్‌ (39) అల్లిఖాన్‌పల్లి తండాకు చెందిన లక్ష్మణ్‌నాయక్‌తో కలిసి బుధవారం సాయంత్రం పిట్లం వెళ్లారు.

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........