లక్ష్యాలు నెరవేరాయా?

నోట్ల రద్దు రంగాలపై ప్రభావం

పెద్ద నోట్ల రద్దు.. మూడేళ్ల కిందట మోదీ ప్రభుత్వం ప్రకటించిన అతిపెద్ద ప్రకటన. యావత్‌ భారత్‌ దేశం ఒకే సారి ఆశ్చర్యం, ఆందోళన, ఆనందానికి గురైంది. రూ.500, రూ.1000 నోట్లను అంటే చెలామణీలో ఉండే 86 శాతం నగదు రద్దయితే పరిస్థితి ఏమిటన్నది సామాన్యులకు అర్థం కాలేదు. కానీ నిర్ణయం వచ్చింది. మూడేళ్లు గడిచింది. మరి ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు నెరవేరాయా? గాడి తప్పాయా? ఏ రంగం ఎంత ప్రయోజనం పొందింది? ఎంత ఇబ్బంది పడింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిందే.

ఒక్కసారిగా ఉన్న నోట్లు మాయమై కొత్త నోట్లు వచ్చాయి. పెద్దోళ్లు పెద్దగా ఇబ్బంది పడినట్లు కనిపించలేదు. సామాన్యులే ఏటీఎమ్‌ల వద్ద పడిగాపులు కాశారు. సామాన్యుల వరకే ఆ ప్రభావం పరిమితం కాలేదు. ఒక్కో రంగానికి ఒక్కో పాఠాన్ని నేర్పింది. అదేంటో చూద్దాం.

స్థిరాస్తి రంగం 

భారత్‌లోని అగ్రగామి తొమ్మిది నగరాల్లో మొత్తం డెవలపర్ల సంఖ్య 2017-18 కల్లా 50 శాతం తగ్గింది. ముఖ్యంగా గురుగావ్‌లో 2011-12లో 82 మంది డెవలపర్లు ఉండగా.. వారి సంఖ్య 19కి తగ్గింది. అంటే 76.8 శాతం తగ్గారు. ఇక నోయిడాలోనూ 73.2 శాతం మేర తగ్గారు. స్థిరాస్తి రంగంలో తక్కువ కాలం(ఒకట్రెండు ప్రాజెక్టులు) గడిపే డెవలపర్లు పెద్ద నోట్ల రద్దు అనంతరం మార్కెట్‌ను వీడారు. ముంబయి, పుణె, థానే, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌లలో డెవలపర్ల సంఖ్య బాగానే తగ్గింది. చిన్న డెవలపర్లపై ప్రభావం గట్టిగా పడడంతో ఈ రంగం మందగమనం పాలైంది. వారు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తగిన సామర్థ్యం లేకపోవడం ఇందుకు కారణంగా నిలిచింది.

వాలెట్లు

పెద్ద నోట్ల రద్దుతో భారీగా ప్రయోజనం పొందిన రంగం ఏదైనా ఉందంటే అది వాలెట్లే. గూగుల్‌, వాట్సప్‌ వంటి అంతర్జాతీయ దిగ్గజాల నుంచి పేటీఎమ్‌, మొబిక్విక్‌, ఫ్రీఛార్జ్‌ వంటి మొబైల్‌ వాలెట్లు భారీగా వృద్ధి చెందాయి. డిసెంబరు 2018 వరకు చూస్తే యూపీఐ ద్వారా రూ.1.02 లక్షల కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. నెఫ్ట్‌ ద్వారా రూ.9.88 లక్షల కోట్ల లావాదేవీలు జరగ్గా.. ఇక మొబైల్‌ బ్యాంకింగ్‌ చెల్లింపులు సెప్టెంబరు 2015 నుంచీ పెరుగుతూనే వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం అన్ని డిజిటల్‌ లావాదేవీలు 440 శాతం మేర పెరిగాయి.

ఎఫ్‌ఎమ్‌సీజీ

నోట్ల రద్దు అనంతరం ఎఫ్‌ఎమ్‌సీజీ కొనుగోళ్లు తగ్గాయి. ప్రజల చేతిలో డబ్బులు ఆడకపోవడంతో జాగ్రత్తగా ఖర్చు చేశారు. ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తులపై 2017-18లో చేసే వ్యయం 10 % మేర తగ్గింది.

ఉద్యోగాలు

2016-17లో నిరుద్యోగ రేటు నాలుగేళ్ల గరిష్ఠానికి చేరింది. 2017-18లో 45 ఏళ్ల గరిష్ఠ స్థాయి అయిన 6.1 శాతానికి పెరిగింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఉద్యోగాల్లో 2-3 శాతం మేర తగ్గుదల కనిపించింది. 2016-2018 మధ్య 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.

రైతుల ఆదాయాలు, కూలీల వేతనాలు

పూర్తిగా భౌతిక నగదుపైనే ఆధారపడే వ్యవసాయ రంగంపై గట్టి ప్రభావమే పడింది. చాలా మంది రైతులు పంటలను విక్రయించుకోవడానికి కష్టపడ్డారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు తగిన నగదు లభించలేదు.  వర్షాలు సగటు కంటే ఎక్కువగా కురిసినా.. రైతుల ఆదాయం, కార్మికుల వేతనాలు 2016-17లో తగ్గాయి.

18%

రద్దుకు ముందుతో పోలిస్తే 2018-19లో చెలామణీలో ఉన్న నగదు 18% ఎక్కువగా ఉంది.

100 కోట్లు

యూపీఐ లావాదేవీలు అక్టోబరు 19లో 100 కోట్లకు చేరి ఆల్‌టైం గరిష్ఠాన్ని చేరాయి.

414 కోట్లు

2018-19లో మొబైల్‌ వాలెట్‌ లావాదేవీల సంఖ్య ఇది. వీటి విలువ రూ.1.8 లక్షల కోట్లకు పైనే.

మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం [01:04]

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం గురువారం మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీఓకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు.