పంత్‌ ఇంకెప్పుడు

ధోని వారసుడిగా అతడికి ఉజ్వల భవిష్యత్తుందని అంచనా వేశారంతా! కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లతో అతడు భరోసా ఇచ్చాడు కూడా. కానీ ఇటీవల వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలకు గురవుతున్నాడు. మ్యాచ్‌ మ్యాచ్‌కూ బ్యాట్స్‌మన్‌గానే కాదు.. వికెట్‌ కీపర్‌గానూ అతడి సామర్థ్యంపై ప్రశ్నలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గట్లేదు. మరి వీటికి పంత్‌ ఎప్పటికి సమాధానమిస్తాడు? ఎప్పుడు గాడినపడతాడు? సంగక్కర లాంటి దిగ్గజం అతడికిస్తున్న సలహా ఏంటి?

త 10 టీ20ల్లో సగటు 18.87. రెండంకెల స్కోరుకే కష్టపడుతున్నాడు. గత 9 వన్డేల్లో సగటు 23.50. పంత్‌ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడనడంలో సందేహం లేదు. ఇప్పుడంతా అతడికి పరీక్షా కాలమే. జట్టులో స్థానం కోసం పోరాడాల్సిన పరిస్థితి. వరుస వైఫల్యాల నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో టెస్టు జట్టులో ఉన్నా.. వికెట్‌కీపర్‌ స్థానాన్ని సీనియర్‌ సాహాకు కోల్పోయాడు. బంగ్లాతో టీ20 సిరీస్‌కు మరో వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్‌ను కూడా ఎంపిక చేయడం ద్వారా.. మరెన్నో అవకాశాలను మిగిలి లేవని సెలక్షన్‌ కమిటీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బంగ్లాతో పొట్టి సిరీస్‌ పంత్‌కు చాలా కీలకమైంది. కానీ పంత్‌ ఆట మాత్రం పెద్దగా మారలేదు. కనీసం తన వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యంతోనైనా బ్యాటింగ్‌ వైఫల్యాన్ని కాస్త భర్తీ చేసుకోగలుగుతున్నాడా అంటే.. అదీ లేదు. వికెట్ల వెనక అతడి ప్రదర్శన సాధారణ స్థాయిలో కూడా ఉండట్లేదు. క్యాచ్‌లు వదిలేయడం, స్టంపింగ్‌ అవకాశాలు చేజార్చడం అతడికి మామూలైపోయింది. బంగ్లాతో తొలి టీ20లో 26 బంతుల్లో 27 పరుగులు చేశాడు. అతడి తప్పుడు డీఆర్‌ఎస్‌ నిర్ణయాలతో జట్టు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. కానీ కనీస ప్రమాణాలు లేని వికెట్‌ కీపింగ్‌తో మళ్లీ తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నాడు. బంతిని అందుకునేటప్పుడు అతడి గ్లోవ్స్‌ స్టంప్స్‌ దాటి రావడంతో లిటన్‌ దాస్‌ను అతడు చేసిన స్టంపౌట్‌ చెల్లలేదు. అది నోబాల్‌ అయిపోయింది. లిటన్‌ బతికిపోయాడు. ఆ తర్వాత సౌమ్య సర్కార్‌ను అతడు స్టంపౌట్‌ చేశాడు. కానీ అంతకుముందు తప్పునే పునరావృతం చేసినంత పనిచేశాడు. 22 టీ20 మ్యాచ్‌లు ఆడిన పంత్‌ స్టంపౌట్‌ చేయడం ఇదే తొలిసారి అంటేనే.. అతడి వికెట్‌ కీపింగ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తప్పులు మీద తప్పులు చేస్తూనే ఉన్నా పంత్‌కు అదే ధోరణిని కొనసాగిస్తే.. ఎప్పటిలా అవకాశాలు రావు. తప్పులు దిద్దుకోవడానికి ఇక మిగిలింది తక్కువ సమయమే.

అతడేం చేయాలంటే..: వైఫల్యాల నుంచి బయటపడాలంటే, కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాలంటే బ్యాటింగ్‌, వికెట్‌కీపింగ్‌లో పంత్‌ సరళంగా ఉండాలని శ్రీలంక దిగ్గజం కుమార్‌ సంగక్కర అన్నాడు. ‘‘పంత్‌ సరళంగా ఉండాలి. తన బలహీనతేంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత వ్యూహాలు రచించుకోవాలి. ఇప్పుడైతే అతడు తన ఆట సరళంగా ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడికి గురికావొద్దు’’ అని చెప్పాడు. ‘‘ఎవరైనా అతడితో మాట్లాడి ఒత్తిడి తగ్గించడం, స్వేచ్ఛగా ఆడేలా చూడడం కూడా ముఖ్యమే’’ అని స్టార్‌స్పోర్ట్స్‌ కార్యక్రమంలో అన్నాడు. వికెట్‌ కీపింగ్‌ చేస్తే అతడి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని  చెప్పాడు. కెరీర్‌లో పంత్‌కు ఇది కీలక దశ అని.. ఈ దశలో సెలక్టర్లు, టీమ్‌మేనేజ్‌మెంట్‌ అతడికి అండగా ఉండాలని వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. ‘‘సెలక్టర్లు, టీమ్‌మేనేజ్‌మెంట్‌ పంత్‌కు విశ్వాసాన్నివ్వడం చాలా అవసరం. ప్రతి మ్యాచ్‌ తనకు ప్రపంచకప్‌ ఆడిషన్‌ అన్న ఆలోచన ఆటగాడిలో కలగకుండా చూడాలి’’ అని చెప్పాడు.

‘‘పంత్‌ చాలా మంచి ఆటగాడు. నెమ్మదిగా పరిణతి సాధిస్తాడు. అతడికి సమయమివ్వండి. బాగా ఆడతాడు’’

- గంగూలీ

మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం [01:04]

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం గురువారం మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీఓకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు.